Showing posts with label ఎస్.ఏ.రాజ్ కుమార్. Show all posts
Showing posts with label ఎస్.ఏ.రాజ్ కుమార్. Show all posts

ఊగే ఊగే ఉయ్యాలా

చిత్రం: పెళ్లి (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
రచన: సిరివెన్నెల 
గానం: బాలు, చిత్ర

పల్లవి : 

ఊగే ఊగే ఉయ్యాలా  
రాగం తియ్యాలా
సాగే సాగే జంపాలా 
తాళం వేయాలా

కొండాకోనా గుండెల్లో 
ఊగే ఉయ్యాలా

ఊగే ఊగే ఉయ్యాలా  
రాగం తియ్యాలా

వాగు వంక ఒంపుల్లో 
సాగే జంపాలా

సాగే సాగే జంపాలా 
తాళం వేయాలా

దొరికే చుక్కను ఏలే దొరనేనవ్వాలా

కోరితే కోరిక చూసి చిలకై నవ్వాలా

మన్నెంలో అంతా మనకేసే చూసే వేళ

ఊగే ఊగే ఉయ్యాలా

ఏ స్వప్నలోకాల


ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
సుస్వాగతం(1998)
బాలు, చిత్ర
సిరివెన్నెల
ఎస్. ఏ. రాజ్ కుమార్

పల్లవి : 

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

తళతళ తారక 
మెలికల మేనక
మనసున చేరెగా 
కళగల కానుక
కొత్తగా కోరిక చిగురులు వేయగా

పాటలలోనా జీవితమే పలికించేనంటా


పాటలలోనా జీవితమే
నవవసంతం (1990)
ఎస్.ఏ. రాజ్ కుమార్
బాలు

పాటలలోనా జీవితమే పలికించేనంటా
మాటలలో చందనమే వెదజల్లేనంట

ఉదయం పలికించాలి నాదం నాదం
గాలీ ఇక వేయాలి తాళం తాళం

పైట కొంగు ఎంతో మంచిది


పైట కొంగు ఎంతో మంచిది
పెళ్ళి (1997)
సిరివెన్నెల
బాలు, చిత్ర
ఎస్.ఏ. రాజ్ కుమార్

పైట కొంగు ఎంతో మంచిది జారుతున్నది

పాడు సిగ్గు ఎంతో చెడ్డది ఆపుతున్నది

జోడుకట్టిచూడు నిన్ను ఏడిపించదింక ఈడు

నచ్చచెప్పి చూడు కాస్త రెచ్చగొట్టి జతకూడు

కాసుకో అమ్మడూ..... కొంటె దూకుడు

తెలుసా నేస్తమా


తెలుసా నేస్తమా
సింహరాశి (2001)
వెనిగెళ్ళ రాంబాబు
ఎస్.ఏ.రాజ్ కుమార్
హరిహరన్, చిత్ర

తెలుసా నేస్తమా నేస్తమా పూజించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ
మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా
తెలుసా నేస్తమా నేస్తమా ప్రేమించాననీ
నీవే ఆశగా శ్వాసగా జీవించాననీ
మదిలో మౌనరాగమే మెదిలే మెల్లమెల్లగా
కదిలే నీలిమేఘమే కరిగే తేనెజల్లుగా

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా



నన్ను లాలించు సంగీతం నువ్వే
చిత్రం: చెప్పవే చిరుగాలి (2004)
సంగీతం: ఎస్.ఎ రాజ్ కుమార్
సాహిత్యం: శివ గణేష్
గానం: ఉన్ని మీనన్ , సుజాత

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా
నువ్వు చిరుగాలివా లేక విరివానవా
మరి ఆ నింగి ఈ నేల నిప్పే నువ్వా
లేకా నేనే నువ్వా

నన్ను లాలించు సంగీతం నువ్వే కదా
నిన్ను పాలించు సంతోషం నేనే కదా

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు
సుస్వాగతం(1998)
ఎస్. ఏ. రాజ్ కుమార్
షణ్ముఖశర్మ
మణికిరణ్

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ  శుభాకాంక్షలందజేయమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్రరత్నమా నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపీ హ్యాపీ ఓ .. ఓ
హ్యాపీ  హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా మిత్రమా

తెలియకడుగుతున్నాలే కంప్యూటర్  ఏమంటోందీ పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైందీ
బోధపడని కంప్యూటర్  బదులన్నదే లేదందీ విసుగురాని నా మనసే ఎదురే చూస్తోందీ
ప్రేమ కథలు ఎప్పుడైన ఒక్కటే బ్రాండ్  ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టు డేటు ఫ్రెండు మాది తోటల్ చేంజ్  పాత నీతులింక మాకు నో   ఎక్స్చేంజ్
ఫ్రెండు లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే
కలను వదిలి ఇలను తెలిసి నడుచుకొ    హ్యాపీ  హ్యాపీ  ఆ..ఆ
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా మిత్రమా

నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా  తలచుకొంటె ఏమైనా ఎదురే లేదనమా
నేల విడిచి సామైతే  టైంవేస్టురా ఈ ధీమా  ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా
రోజనబ్బురమ్మంటున్న రోజు కదా   తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
లవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా   చూడకుండ చేయి వేస్తె ముప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతె పువ్వులింక దక్కునా   లక్ష్యమందకుండ లైఫుకర్థమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకద   హ్యాపీ హ్యాపీ  ఆ .. ఆ

హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్సు ఉంది అందుకోర పుత్రరత్నమా నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే
చిలిపి వయసు వరస తమకు తెలియద హ్యాపీ హ్యాపీ  ఓ .. ఓ
హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు మళ్ళి మళ్ళి చేసుకోగ శుభాకాంక్షలందజేయమా మిత్రమా

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ


ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
రాజా (1999)
సిరివెన్నెల
ఎస్.ఏ.రాజ్ కుమార్
చిత్ర

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

గుళ్లో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామపళ్లనే దోచే తోట జ్ఞాపకం
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

చిన్ని చిన్ని ఆశలున్న



చిన్ని చిన్ని ఆశలున్న
అందాలరాముడు (2006)
ఎస్.ఏ.రాజ్ కుమార్
చిత్ర

పల్లవి

చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా
తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగలా అలుపన్నదే రాదా
ఎక్కడో పూల పొదరిల్లలో తుమ్మెదే వాలి జుమ్మంటే
రివ్వని గువ్వలా నింగిలో నువ్విలా తేలిపోతుంటే
ఎలా నిన్ను ఆపను వయసా... వయసా...

చరణం 1

అణువు అణువు అందమేలె నీలీ మేఘాలకీ...
ఆశ పడిన చందమామ అందరాదే మరి...
ఈ గమ్మత్తొ చేసి ఈ అందాలె తెచ్చి నా గుండెల్లో దాచాలి...
నా ఒళ్ళంత మెరిసి మా ఊరంతా చూసి నా చుట్టూర చేరాలి...
ఏమే చిలకా ఏమంటావే నీకంటే నేబాగుంటాలె
తెలుసా తెలుసా తెలుసా...||చిన్ని చిన్ని||

చరణం 2

మిడిసి పడకే చిలిపి గాలి లాగినా పైటనీ...
ఎగిరిపోకే జిలుగు పైట ఇంత చిరుగాలికీ...
ఆ కొమ్మల్లొ పిట్ట కూ కుక్కూ అంటుంటే నా ఒళ్ళేమో జిల్లంది
నా అందాల రాజు ఓ అంబారి తెచ్చి రా రమ్మన్నట్టే ఉంది...
అరె తీరా చూస్తే ఏమీలేదు ఇంకా నున్ను ఊరించొద్దు
మనసా మనసా మనసా ...||చిన్ని చిన్ని||

రాజాధిరాజా వీరాధివీర



రాజాధిరాజా వీరాధివీర
అందాలరాముడు (2006)
ఎస్.ఏ.రాజ్ కుమార్
టిప్పు

యే.. రాజయోగం వచ్చిందయ్యో నీకూ..
యే.. మంచిరోజులొచ్చాయిలే నేడూ..
హే. రాజాధిరాజా వీరాధివీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు
హే. నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే
నిన్ను చూసిన మాకు పుణ్యమే
అందాలరాముడా రా.రా.రా.రా.
రాజాధి రాజావీరాధి వీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు

పువ్వుల చొక్కా తొడిగా వంటే
ఎవరీ మన్మధుడని అంటారయ్య నిన్ను
కళ్ళజోడు పెట్టావంటే
సిన్మా హిరోలాగే ఉంటావయ్య నువ్వు
గురువానీది.. ఆ సింహరాసి కాదా
మొనగాళ్ళైన నీ కాళ్ళు మొక్కలేదా
ఎందరెందరో మెచ్చినవాడు మాఊరికే వచ్చాడు
ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం బెదిరేలా చిందులు తొక్కాలి
ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం బెదిరేలా చిందులు తొక్కాలి
రాజాధిరాజా వీరాధివీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు

ఆ.. అమ్మ..
అన్న అదేంటన్నా అట్ట పడిపోయావ్
ఇందాకడ్నించి మీరేంచేత్తనార్రా
మిమ్మల్ని పొగుడుతూ పాడతాన్నావండి
అద్ది అందికే దిష్టి తలిగి కిందడి పోయాను
ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి
ఇప్పుడు తిడతాపాడండ్రా
కుదరదండి
ఏ?..
మిమ్మల్ని పొగుడుతూ
పాడ్డానికే డబ్బులిచ్చారండి
ఓ..ఈ వెయ్యా తీసుకొని తిట్టేయండ్రా
అయితే ఒకే. తిట్టండ్రా..

సచ్చినోడా నీ యమ్మ కడుపు మాడ
నువు పక్కనుంటె ఊరకుక్క సచ్చినంత కంపు
ఓరి నాయనో ఓరి దిక్కుమాలినోడా
నీ జిమ్మదియ్య దొంగకోళ్ళ చూపు చూడమాకు
హే పోరా పోరంబోక ఈ ఊళ్ళో ఉండమాక
హే పోరా పోరంబోక ఈ ఊళ్ళో ఉండమాక
అరె సిగ్గు ఎగ్గు ఉంటే నీకు
మళ్ళీ ఇట్టారానే రాకు
పెంట నాయాల రే గోతికాడ నక్క
నీ గుడ్డలూడదీసి నిన్ను చెప్పుతోటి కొట్ట
పెంట నాయాల రే గోతికాడ నక్క
నీ గుడ్డలూడదీసి నిన్ను చెప్పుతోటి కొట్ట
ఆ పండిరా రేయ్ మీకు దన్నమెడతానురా బాబు
మీరు తిడతుంటే నామీద నాకే అసహ్యం
ఏసేతుందిరా ఫస్ట్దే కంటిన్యూ అయిపోండమ్మా
అలాగలాగే పాడిండిరా..
రాజాధిరాజా వీరాధివీర నీకు వందనాలు
కోటి సూర్యులు వేలతారలు నీకు సాటికారు
హే. నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే
నిన్ను చూసిన మాకు పుణ్యమే
అందాలరాముడ రార. రార.. ,

జాబిల్లి రావే



జాబిల్లి రావే
అందాలరాముడు (2006)
ఎస్.ఏ.రాజ్ కుమార్
రాజేష్, శ్రేయాగోషాల్

జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మా జాబిల్లి
పల్లవి

జాబిల్లి రావే వెండి జాబిల్లి నీతోనే ఉంటానమ్మా జాబిల్లి
నిన్నే కోరిందీ వెండి జాబిల్లి నీతోడై ఉంటానంది మనసిచ్చి
మబ్బుల్లో దాగి దోబూచి ఆడి నాముందే ఉంటూ నమనసేదోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి ||నిన్నే కోరింది||

చరణం 1

దూర దూర ఈడు తోడు లేక నేడు ఉసురుసురన్నది చూడు కోరిందే నీతోడు...
కొంటె కళ్ళ చూపు గుచ్చుకున్న నాడు రేగదామరి జోడు ఆగదే ఎద తూరు
నా వెంటె చెలి నీవుంటే ఇంకేవి కోరనులే
అవునన్నా నువు కాదన్నా నేనీలో సగమేలే
ఆ మాటే చాలమ్మా నీ నీడై ఉంటాలే ||నిన్నే కోరింది||

చరణం 2

వెన్నెలంటి నువ్వు వెన్నపూస మనసు చూసి నీలో నేను చేరువయ్యా నీకు
పాలరాతి బొమ్మపైడి పూల బొమ్మ దేవతంటే ఎవరో చూశాను నీలో నేడు
బతుకంతా నీ జతగా ఉండే వరమే ఇచ్చావే
బడిలో చదివే ఆనాడే నా ఎదలో చేరావే
నీ ఒడిలో గొప్పల్లె కలకాలం ఉంటాలె ||జాబిల్లిరావె||

కిల కిల నవ్వే కోయిల కోసం


సూర్యవంశం (1998)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
గానం: బాలు, చిత్ర
రచన: ఇ.ఎస్. మూర్తి

పల్లవి: 

ల ల ల …..
కిలకిల నవ్వే కోయిల కోసం 
వచ్చిందీ మధుమాసం

మిలమిల మెరిసే చంద్రుడి కోసం 
తెరతీసెను సాయంత్రం

జోలగా లాలించగా నీ నీడ దొరికింది

కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది

ఎదవిల్లును వంచిన వాడే 
నీ రాముడు అన్నది మనసే

గుడి తలుపులు తీయక ముందే 
వరమిచ్చెను దేవత ఎదురై

నీదే ఆ చెలి

నిజమేనా జాబిలీ

కిలకిల నవ్వే కోయిల 

చుక్కలన్ని ముగ్గులై


చుక్కలన్ని ముగ్గులై
చిత్రం : సూర్యవంశం (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్  
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు, సుజాత   

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి 
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి 
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

నువ్వే తోడుగ ఉండే జీవితం
నిటూర్పు జాడేలేని నిత్యనూతనం
నువ్వే నీడగ పంచే స్నేహితం 
హేమంతం రానే రాని చైత్ర నందనం
ఎండల్లో చిందే చెమట అమృతం పోయగ 
గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామ
నిందల్లో నిష్టురాలే నిప్పులే కాంతిగా 
రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా
నడిరేయి చేరనీయక సుర్యదీపముంది 
మన దారి చూపుతోంది

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి 
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

అన్ని రోజులు సన్నజాజులై 
అందంగ అల్లుకుందాం చిన్ని మందిరం
నిన్న ఊహలే నేటి ఊయలై 
గారంగ పెంచుకుందాం స్నేహ బంధనం
రంగేళి సంతోషాల చందనం చల్లుతూ 
ఈ గాలి అందుకుంది కొత్త జీవితం
ఉంగాల సంగీతాల రాగమే పాడుతు 
సాగాలి సూర్యవంశ సుప్రభాతం
అంచుదాటు అమృతం 
పంచుతోంది నిత్యం 
మన ప్రేమ పారిజతం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి 
కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
లాలలాల్ల లల లాలలాల్ల 

చరణ కొంకిణులు గొల్లు గొల్లుమన


చరణ కొంకిణులు గొల్లు గొల్లుమన
చిత్రం : శుభాకాంక్షలు (1997)
సంగీతం : ఎస్.ఎ.రాజ్ కుమార్
గానం : మనో

చరణ కొంకిణులు గొల్లు గొల్లుమన
కర్ర కంకణము గల్లలాడగా
ఇనీల కచభర ఇలాస బంధుర
తన్నులతిక చంచలించిపోగా
ఆడ్డవే మయూర్రే..
నటనమాడ్డవే మయ్యూర్రేయ్..
నీ కులుకులు గని నా పలుకులిరవ
నీ నటనలు గని నవ కవిత ఎలవగా
ఆడవే మయూరె.. మయూరె..మయూరే..

పాల నేత్ర సంప్రభవ జ్వాలలు
ప్రశవ శరుని దహియించగా
పతిని కోలుపడి రతీదేవి
దుఃఖితమతియై రోధించగా

హిమగిరీంధ్ర
శిఖరాగ్ర తాండవత్
ప్రమధ గణము కనిపించగా
ప్రమద నాద కర
బాంకజ భ్రాంకుత
ఢమరుధ్వని వినిపించగా
ప్రళయ కాల
సంచలిత భయంకర
జలదరార్భకుల
చలిత దిక్దటుల
చకిత దిక్కరుల
వికృత ఘీంకృతుల
సహస్ర ఫణి
సంచలిత భూకృతుల

కళ్ళలోన
కనుబొమ్మలోన
అదరాలి లోన
బెదరాలి పైన
గళ సీమ లోన
కటి దోమ లోన
కరయుగములోన
నీ మొగములోన
నీ ఒంటిలోని
ప్రతి ఇంచి లోన
అనంత ఇదములు
అభినయించి
ఇక ఆడ్డవే.. ఆడ్డవే.. ఆడ్డవే...

తియ్యని ఈ నిజం


తియ్యని ఈ నిజం
ఖుషి ఖుషీగా (2004)
ఉమా మహేశ్వరరావు
ఎస్.ఏ.రాజ్ కుమార్
హరిహరన్, మాతంగి

తియ్యని ఈ నిజం చెప్పనా...
నిను చేరింది మనసే...
దాగని ఈ నిజం విప్పనా...
నిను కోరింది వయసే...
నా ప్రతీ ఊహలో నువ్వే ఉన్నావనీ...
ఈ ప్రియభావన తెలిపే రోజేదనీ...
నిలదీసాను చిరుగాలినీ...

||తియ్యని||

యవ్వనం నిధిలా దాచి..
ఇవ్వనా కానుక చేసి
వేచి... తలుపు తెర తీసీ...
తారలా మెరిసే చెలికి
చేరనా తళుకై దరికి
నీడై ఆమెకొక తోడై...
ఇలా ఎంత కాలం సదా బ్రహ్మచర్యం...
ఎలా చేరుకోను ప్రియా ప్రేమసౌధం...
తెలియకనే అదిరినదా అధరం...
నా యెదలో నీ స్వప్నం మధురం...
దరి చేరాలి మురళీధరా...

||తియ్యని||

నిన్ను నా సిగలో తురిమి
చెయ్యనా త్వరగా చెలిమి
యోగి.. ప్రేమ రసభోగి...
రాలుతూ చినుకై ఎదుట
రాత నై చెలి నీ నుదుట
ఉంటా పైట పొదరింటా
ఎలా దాచుకోను ప్రియా కన్నె ప్రాయం...
ఇలా ఇవ్వరాద చెలీ సొగసు దానం...
నీ తలపే ప్రతి నిముషం మురిపెం..
నీ కొరకే నా హృదయం పయనం...
ఇటు రావయ్య నవ మన్మధా...

||తియ్యని||

ఆనందమానందమాయె


ఆనందమానందమాయె
చిత్రం: శుభాకాంక్షలు (1997)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: షణ్ముఖ శర్మ
గానం: చిత్ర

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే

నువ్వు నడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా
నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా
నిండు గుండె గుమ్మంలో తోరణంగ నేనున్నా
నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె

రాగమాల రమ్మంటూ స్వాగతాలు పలికింది
ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది
జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసిందీ
రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి నీకోసం ప్రేమను దాచి
రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి
శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వులమాలతో
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారిన మాయే

గాలీ చిరుగాలీ



గాలీ చిరుగాలీ
చిత్రం: వసంతం (2003)
గాత్రం: చిత్ర
రచన: సిరివెన్నెల 
సంగీతం:ఎస్.ఏ.రాజ్ కుమార్

గాలీ చిరుగాలీ నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారీ అది ఎవరికి తెలుసమ్మా
రూపమే వుండని ఊపిరే నువ్వనీ 
ఎన్నడూ ఆగని పయనమే నీదని
గాలీ చిరుగాలీ నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా

గోదారల్లే పొంగే నాలో సంతొషం


గోదారల్లే పొంగే నాలో సంతొషం
వసంతం (2003)
కులశేఖర్
ఎస్.ఏ. రాజకుమార్
బాలు

పల్లవి: 

గోదారల్లే పొంగే నాలో సంతొషం
గొరింటల్లే పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మ గుండెల్లోన స్వాశ
కలహంస నడకల్లోన అందాల హైలెస్స
నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
నిండా నింపిందమ్మ నాలో సంగీతం

చరణం 1:

గుండెలో వేల ఆశలే 
నను ఇంతగ పెంచాయిలే
కళ్ళలో కోటి కాంతులే 
పలు వింతలే చూపాయిలే
సంక్రాంతే రోజు నా మదికి
ఈ అనుభవమే నాకు కొత్తగున్నది
రానంటూనే వచ్చిందమ్మ కొంటె కోయిల
రాగలెన్నొ తీసిందమ్మ తీయతీయగ

చరణం 2:

గాలిలో మబ్బు రేకులా 
మనసెందుకో తేలిందిలే
హాయిగా పండు వెన్నెల 
పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి 
ఇది ఆనందం చేసే కొంటె అల్లరి
గుండెల్లోన ఉండాలంట ఎపుడూ ఆరాటం
మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం