తెప్పలెల్లిపోయాక
చిత్రం : భారతీయుడు (1996)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం : భువనచంద్ర
గానం : బాలు
పల్లవి:
తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా
ఉదయం వరకూ పోరాడినా రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తయితే దుఃఖమంతా ధూళైతే చిన్నమ్మా
చిన్నమ్మా ఇంటి వాకిలి వెతికి ఆకాశం
చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో.. మరిగే.. శోకం.. అంతా
నేడు తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగి పోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా..
చరణం 1:
వన్నెల చిన్నెల నీటి ముగ్గులే బుగ్గపై కన్నులే వేయ
ఇంకనూ తప్పదా పోరాటం ఈడనే ఆడను పోరాడ
నిన్ను అడిగే హృదయం పంచుకుంటినా
ప్రతిరోజూ ముళ్ళపై పవళించినా
నేనో.. నదిని.. చినుకై రావా
అమ్మమ్మ ఇన్నాళ్ళు.. నీకై వేచి వుంటినీ
నేడు తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా..
చరణం 2:
నేస్తమా నేస్తమా.. నీకోసం గాలినై వచ్చినా నేను
పూవులో తేనెలా నీ రూపం.. గుండెలో దాచినా చూడు
నీ కాలికి మట్టినై తోడు ఉండనా
కనుపాపకి రెప్పలా కావలుండనా
ఆశనై.. కోరి.. శ్వాసనై చేరి
కౌగిట్లో జోకొట్టి.. గుండె హారతివ్వనా
నేడు తెప్పలెల్లిపోయాక ముప్పు తొలగిపోయిందే చిన్నమ్మా
నట్టనడి రాతిరిలో నవ్వు మొగ్గ విచ్చిందే చిట్టెమ్మా..
ఉదయం వరకూ పోరాడినా రుధిరంలోనే నడయాడినా
గడ్డిపోచ కత్తయితే దుఃఖమంతా ధూళైతే చిన్నమ్మా
చిన్నమ్మా ఇంటి వాకిలి వెతికి ఆకాశం
చిరుజల్లులు కురియును మనకోసం
ఎదలో.. మరిగే.. శోకం.. అంతా..