January 11, 2020

నీ పిలుపే..ప్రభాత సంగీతం


నీ పిలుపే ప్రభాత సంగీతం
చిత్రం : సుబ్బారావుకి కోపం వచ్చింది (1981)
సంగీతం : చెళ్ళపిళ్ళ సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ..
నీ పిలుపే..ప్రభాత సంగీతం
నీ వలపే..మధుమాసం
నీ హృదయం..రసనిలయం

ఆ ఆ ఆ .....
నీ పిలుపే..ప్రభాత సం...గీతం
నీ వలపే..మధుమాసం
నీ హృదయం..రసనిలయం
నీ హృదయం..రసనిలయంచరణం 1 :

ఊహలు పలికే ఉత్పలమాలలు...
ఆ..ఆ..ఆ...
భావన లొలికే చంపక మాలలు..
నీ జడలోనా నిత్యం ముడిచి..
నీ అడుగులపై కానుక చేసి..
కొలిచే నీ కవిరాజునై..
నిలిచేనా.... వలచేనా..

నీ పిలుపే..
ఆ ..
ప్రభాత సంగీతం..
ఆ...
నీ వలపే..
మధుమాసం..
ఆ ఆ ..
నీ హృదయం..రసనిలయం

చరణం 2 :

నందనవనమే పందిరి చేసి..
ఆ...ఆ...ఆ...
పరువం నురగల పానుపు వేసి..
మలయసమీరం వీవెన వీచి..
రసమయలోకం అంచులు చూసి..
కలిసే నీ సురభామనై..
మురిసేనా.... మెరిసేనా...

నీ పిలుపే..
ప్రభాత సంగీతం
నీ వలపే..
మధుమాసం
నీ హృదయం..
రసనిలయం
నీ హృదయం..
రసనిలయం
హ...ఆ...ఆ...ఆ..ఆ
ఆ...ఆ...ఆ...ఆ...