Showing posts with label రమేష్ నాయుడు. Show all posts
Showing posts with label రమేష్ నాయుడు. Show all posts

సిగ్గాయెనమ్మో...

సిగ్గాయెనమ్మో... 
కుడి ఎడమైతే (1979)
రమేష్ నాయుడు 
జానకి 

పల్లవి: 

సిగ్గాయెనమ్మో 
ఆయెనమ్మో...
సిగ్గాయెనమ్మో 
ఆయెనమ్మో  

ఎంత సొగసుగాడే


ఎంత సొగసుగాడే
చితం: సంగీత సామ్రాట్ (1984)
రచన: మహాకవి క్షేత్రయ్య
సంగీతం: రమేష్ నాయుడు
గానం: సుశీల, కృష్ణమూర్తి రాజు

ఎంత సొగసుగాడే గోపాలుడు
ఎంత సొగసుగాడే గోపాలుడు
ఎంత సొగసుగాడే

ఎవ్వడే వాడు...


ఎవ్వడే వాడు...
మహాకవి క్షేత్రయ్య
శృంగార పదనిస
రాగం: శంకరాభరణం, చాపు
సంగీతం: రమేష్ నాయుడు
గానం: మాడపాటి సరళారాణి

పల్లవి :

ఎవ్వడే వాడు...
ఎవ్వడే వాడు...
ఎవ్వడే వాడు
నేను పవ్వళించిన వేళ
పువ్వు బాణాలు వేసి
రవ్వజేసి పోయే...

ఎటువంటివాడే వాడు


ఎటువంటివాడే వాడు
మహాకవి క్షేత్రయ్య
శృంగార పదనిస
రాగం: నీలాంబరి.
త్రిపుట తాళ.
సంగీతం: రమేష్ నాయుడు
గానం: మాడపాటి సరళారాణి

పల్లవి :

ఎటువంటివాడే వాడు
ఎన్నడీ వీధిన రాడు

అనుపల్లవి :

కుటిల కుంతళ మువ్వగోపాలుడట పేరు

కోడి కూసె నయ్యయ్యో


కోడి కూసె నయ్యయ్యో
మహాకవి క్షేత్రయ్య
శృంగార పదనిస
సంగీతం: రమేష్ నాయుడు
గానం: మాడపాటి సరళారాణి  

పల్లవి :
 
కోడి కూసె నయ్యయ్యో....
నా గుండె ఝల్లుఝల్లు మనేనమ్మా...

అను పల్లవి :

చెడెరో నా సామి వద్ద జేరి
నేనే మాటాడు నంతలో
//కోడి//

కనుబొమ్మల పల్లకిలోనా

కనుబొమ్మల పల్లకిలోనా 
చిత్రం :  నెలవంక (1983) 
సంగీతం :  రమేశ్ నాయుడు 
గీతరచయిత :  ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ 
నేపధ్య గానం :  బాలు,  జానకి 

సాకీ : 

ఈ కోవెల వాకిలిలో .. 
ఏదో అడుగు సవ్వడి .. 
ఏ దేవుడు దయతో నా ఎదలో .. 
అడుగిడు .. వడి వడి  

ఆశ జ్యోతిగా వెలిగింది



ఆశ జ్యోతిగా వెలిగింది

చిత్రం : ఆశాజ్యోతి (1981)
గీత రచన : సినారె
సంగీతం : రమేష్ నాయుడు
గానం : వాణీ జయరాం

పల్లవి:

ఆశ జ్యోతిగా వెలిగింది
నిరాశ నీడగా కదిలింది...
నిజము నిప్పుగా రగిలిందంటే
నా ఆశాజ్యోతి ఏమౌతుంది
ఈ ఆశకు జ్యోతి ఏమౌతుంది
ఆశ జ్యోతిగా వెలిగింది
నిరాశ నీడగా కదిలింది...

ఒకే మనసు రెండు రూపాలుగా


ఒకే మనసు రెండు
చిత్రం : సూర్య చంద్రులు (1978)
సంగీతం : రమేష్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : బాలు, చిత్తరంజన్

అహా..ఓహో.. ఎహే..ఆహఅహ్హాహా..
ఒకే మనసు రెండు రూపాలుగా
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా
అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం.
అల్లుకున్న అనుబంధం అదే అదే మన బంధం.

ఒకే మనసు రెండు రూపాలుగా
ఒకే ఊపిరి రెండు హృదయాలుగా

మెరుపులా మెరిసావు


మెరుపులా మెరిసావు 
ప్రేమసంకెళ్లు (1982)
సంగీతం: రమేష్ నాయుడు
రచన: వేటూరి
గానం: బాలు, సుశీల

పల్లవి :

మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు

మెరుపులా మెరిసావు..వలపులా కలిసావు
కన్ను తెరిచి చూసేలొగా
నిన్నలలో నిలిచావు..నిన్నలలో నిలిచావు

జీవన వేణువు పాడెను



జీవన వేణువు పాడెను
సూర్యచంద్ర (1985)
సంగీతం::రమేష్‌నాయుడు 
రచన::వేటూరి
గానం::సుశీల, రాజ్ ‌సీతారామ్

పల్లవి::

జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి..నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..
పూజనీ నీ పూజనీ

జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి..నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..పూజనీ నీ పూజనీ

చూడు పిన్నమ్మా

మాడా వెంకటేశ్వర రావు గారి పాత్రకి అమితమయిన పేరు తెచ్చిపెట్టిన పాట .

చూడు పిన్నమ్మా
చిత్రం: చిల్లర కొట్టు చిట్టెమ్మ (1977)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: దాసం గోపాలకృష్ణ
నేపధ్య గానం: బాలు, బృందం

చూడు పిన్నమ్మా
పాడు పిల్లడు
పైన పైన పడతనంటడు

బిందెతోటి నీళ్ళకెళితే
సందుకాసి సైగ సేస్తడు
ఒంటరీగ.....
ఒంటరీగ వస్త ఉంటే
ఛీ పాడు....ఈలవేసి గోల సేస్తడు
ఇంటిసుట్టూ తిరుగుతుంటడు

ఇదిగో అబ్బాయా... సోడా ఒకటియ్ నాయనా

సందమామా కింద నేనూ
తడిక సాటూ సేసుకోని
తలకి స్నానం  నా తలకి స్నానం సేస్త ఉంటే
అవ్వ...పాడు !
గోడ ఎక్కి సూస్త ఉంటడు
గొప్ప చిక్కులు పెడత ఉంటడు

బావగారూ...నమస్కారం
తమరు కూర్చోవాలి...

పందిరి మంచం పైన నేనూ
పండుకుంటే పాడు పిల్లడు
పిల్లి లాగా...మెల్లగొచ్చి
అబ్బో!!
బుగ్గమీద చిటిక వేస్తడు
గుబులులేపి జారుకుంటడు

మందారమల్లికి శృంగార పూజలు


మందారమల్లికి శృంగార పూజలు
చిత్రం :  మల్లెమొగ్గలు  (1986)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి

పల్లవి :

మందారమల్లికి శృంగార పూజలు..
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
ఆ..ఆ...ఆ..ఆ..
మందారమల్లికి శృంగార పూజలు.. 
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు

నా కళ్ళల్లో  నీ తొలి కాపురాలు.. 
కౌగిళ్లల్లో నీ రాణివాసాలు

మనసైన స్వామికి మందార మాలలు.. 
మరుమల్లె వేళకి సిరిమల్లె డోళలు
ఆ..ఆ..ఆ...ఆ...ఆ..
మనసైనా స్వామికి మందార మాలలు.. 
మరుమల్లె వేళకి సిరిమల్లె డోళలు
నా కళ్ళతోనే నీరాజనాలు .. 
కౌగిళ్లతోనే పూలహారాలు 

చరణం 1 :

పుప్పొడి నలుగులు పెట్టనా.. 
పుత్తడి జిలుగులు చూడనా
పుప్పొడి నలుగులు పెట్టనా.. 
పుత్తడి జిలుగులు చూడనా
గంగా యమునా సరస్వతులతో.. 
కృష్ణవేణినీ జడలల్లనా

వెన్నెల కలువల మెత్తమరించి
వెన్నెల కలువల మెత్తమరించి... 
కిన్నెరవీణలు మీటనా 
పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస
పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస

మనసైన స్వామీకి మందార మాలలు.. 
మరుమల్లె వేళకి సిరిమల్లె డోళలు

చరణం 2 :

పిల్లనగ్రోవిని ఊదనా.. 
పిల్లని గోపిక చేయనా
పిల్లనగ్రోవిని ఊదనా.. 
పిల్లని గోపిక చేయనా
వచ్చీరానీ అష్టపదులతో... 
రాసలీలలే ఆడేయ్యనా

కన్నులవలపులు కౌగిలికిచ్చి...
కన్నులవలపులు కౌగిలికిచ్చి...
వెన్నెల తలుపులు వేయనా...

పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస

పస.. పస...
ససరి..ససరి
సరిగమపరిస

మందారమల్లికి శృంగార పూజలు.. 
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు
నా కళ్ళల్లో  నీ తొలి కాపురాలు.. 
కౌగిళ్లల్లో  నీ రాణివాసాలు

మనసైనా స్వామికి మందార మాలలు.. 
మరుమల్లె వేళకి సిరిమల్లె డోళలు
నా కళ్ళతోనే నీరాజనాలు .. 
కౌగిళ్లతోనే పూలహారాలు

మందారమల్లికి శృంగార పూజలు.. 
ఎన్నెల్ల తల్లికి ఏకాంత సేవలు

చంద్రకాంతిలో

కథానాయికను తెలుగునేలమీద పారే నదులతో పోలుస్తూ అందంగా సాగే వేటూరి గారి సాహిత్యం రమేష్ నాయుడిగారి సంగీతం బాలు గారి స్వరం వెరసి ఈ పాటకు తేనెలాంటి కమ్మదనాన్ని అద్ది ఎన్నిసార్లు విన్నా ఇంకా వినేలా చేస్తుంది.

చంద్రకాంతిలో
చిత్రం : శ్రీవారి శోభనం(1984)
సాహిత్యం : వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : బాలు

చంద్రకాంతిలో చందనశిల్పం..
చంద్రకాంతిలో చందనశిల్పం..
స్వర,శృతి,లయలా మణిహారం..
గేయమంటి నీ సోయగమంతా కవినై పాడుదునా..
చూపుల చలితో ఊహల ఉలితో చెలి నిను తాకుదునా..
చెలి నిను తాకుదునా..

చంద్రకాంతిలో చందనశిల్పం..
స్వర,శృతి,లయలా మణిహారం..
చంద్రకాంతిలో చందనశిల్పం..

తరగలా నవ్వులా నురగలా మువ్వలా
పరుగుల పల్లవితో ఉరవడి ఊహలతో
రాలకు సైతం రాగం నేర్పే రాయల నాటి తుంగభద్రవో
శ్రీనాధుడికే శృంగారాలను నేర్పిన వాణివి కృష్ణవేణివో
ప్రణయ కవన సుందరీ.. దేశి కవితలో తేనెగ పొంగుదునా
నీ పద లయలో నీ అందియనై పదములు కడుగుదునా..
పదములు కడుగుదునా...

చంద్రకాంతిలో చందనశిల్పం..
స్వర,శృతి,లయలా మణిహారం..
చంద్రకాంతిలో చందనశిల్పం..

వెన్నెలా కుంచెలా.. చీకటీ రేఖలా
పండిన కుంకుమతో పచ్చనిశోభలతో
రాముని పదముల నాదమై ఎగసీ నదిగా మారిన గౌతమివో
తెలుగు పాటకీ తెలుగు మాటకీ వెలుగు చూపినా వంశధారవో
వెలుగునీడలే ఏడురంగులై వేణువులూదుదునా..
పుత్తడి బొమ్మకు పున్నమి రెమ్మకు కౌగిలి పట్టుదునా..
కౌగిలి పట్టుదునా..

చంద్రకాంతిలో చందనశిల్పం..
స్వర,శృతి,లయలా మణిహారం..
చంద్రకాంతిలో చందనశిల్పం..

పూర్వజన్మ సంగమం

పూర్వజన్మ సంగమం
చిత్రం : మల్లెమొగ్గలు  (1986)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
ఆ....
కలకానిది కడలేనిది
కడలీ నది కలిపే నిధి
నీలో నాలో పొరలి పొంగు
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం

చరణం 1:

గంగను సురగంగను శివగంగను చేసిన కాశీక్షేత్రమూ...
గంగను సురగంగను శివగంగను చేసిన కాశీక్షేత్రమూ...
నా ఒడిలో కౌగిలిలో ఉన్నది నేనున్నది నీకోసమూ
బ్రతుకులాగ ముగిసిపోదు
వయసులాగ వెలిసిపోదు
బ్రతుకులాగ ముగిసిపోదు
వయసులాగ వెలిసిపోదు
దేనికీ ఓడిపోదు
నీవే నేనై పొంగే ప్రేమ

చరణం 2:

రాధను ఒక రాధను ప్రియగాధను చేసిన యమునాతీరమూ
రాధను ఒక రాధను ప్రియగాధను చేసిన యమునాతీరమూ
నా మదిలో ఒంటరిగా ఉన్నది నేనున్నది నీకోసమూ
గ్రహణాలకు తరిగిపోదు
మరణాలకు మలిగిపోదు
గ్రహణాలకు తరిగిపోదు
మరణాలకు మలిగిపోదు
గాలికి ఆరిపోని
జ్యోతే నాలో వెలిగే ప్రేమ

పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమసంగమం
ఆ....
కలకానిది కడలేనిది
కడలీ నది కలిపే నిధి
నీలో నాలో పొరలి పొంగు
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం
పూర్వజన్మ సంగమం
అపూర్వ ప్రేమ సంగమం

దిమ్మరిని నమ్మకే మనసా


ఊగిసలాడకే మనసా
చిత్రం: కొత్త నీరు (1981)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఎస్. పి. శైలజ

పల్లవి:

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా
ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా
ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ..
ఉర్రూతలూగకే మనసా..ఆ..ఆ..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా

చరణం 1:

తలలోన ముడిచాక.. విలువైన పువ్వైనా.. దైవ పూజకు తగదు మనసా
దైవ పూజకు తగదు మనసా..
పొరపాటు చేశావో దిగజారిపోతావు.. నగుబాటు తప్పదు మనసా
పెడదారి మురిపాలు.. మొదటికే మోసాలు.. చాలు నీ వేషాలు మనసా
చాలు.. నీ వేషాలు మనసా..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా..

చరణం 2:

తుమ్మెదలు చెలరేగి.. తోటలో ముసిరేను.. దిమ్మరిని నమ్మకే మనసా
దేశ దిమ్మరిని నమ్మకే మనసా..
చపల చిత్తం విపరీతమౌతుంది.. చలియించకే వెర్రి మనసా
కపటాలు సరదాలు.. కవ్వించు సరసాలు.. కాలు జారేనేమో మనసా
కాలు.. జారేనేమో మనసా..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ..
ఉర్రూతలూగకే మనసా..ఆ..ఆ..
ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా

ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ


ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ
చిత్రం: దేవుడే గెలిచాడు (1976)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: జాలాది రాజారావు
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ..
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ
చెరిసగాల భావనతో..
యుగయుగాల దీవెనతో
రేపు మాపు లాగా కలసిఉందాము..
కరిగిపోదాము.. కరిగిపోదాము..
నాలో.. నీలో.. నాలో నీలో
నువ్వు నేనుగా మిగిలి పాడతాను..
పాడి ఆడతానూ.. ఆ.. ఆ.. ఆ..

ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ..
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ

చరణం 1:

నిన్నటిలో నిజంలాగనే రేపు తీపిగావుంటే...
ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే
చావని కోరికలాగే...పుడుతుంటాను..
తిరిగిపుట్టి చావకుండా బ్రతికుంటాను

ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ..
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ

చరణం 2:

నా జన్మకు ప్రాణం నీవై..
నీ ప్రాణికి ఆత్మను నేనై
కాలానికి ఇరుసువు నీవై..
తిరుగాడే వలయం నేనై
ఎన్ని తరాలైనా..
మరెన్ని యుగాలైనా
వీడని బంధాలై..
కావ్యపు గంధాలై
నాలో.. నీలో..
నాలో నీలో
నువ్వు నేనుగా మిగిలి పాడతాను..
పాడి ఆడతానూ.. ఆ.. ఆ.. ఆ..

ఈ కాలం పది కాలాలు బ్రతకాలనీ..
ఆ బ్రతుకులో నీవూ నేనూ మిగలాలనీ