వెన్నెలలో మల్లియలు
మనుషులు-మమతలు (1965)
సంగీతం: టి.చలపతిరావు
రచన: దాశరథి
గానం: సుశీల
పల్లవి::
వెన్నెలలో మల్లియలు..
మల్లెలలో ఘుమఘుమలు
వెన్నెలలో మల్లియలు..
మల్లెలలో ఘుమఘుమలు
ఘుమఘుమలో..గుసగుసలు
ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు
చరణం::1
నీ హృదయంలో..నిలవాలని
నీ కౌగిలిలో..కరగాలని
నీ హృదయంలో..నిలవాలని
నీ కౌగిలిలో..కరగాలని..
నీవే నీవే..కావాలని..
ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు
వెన్నెలలో మల్లియలు..
మల్లెలలో ఘుమఘుమలు
ఘుమఘుమలో..గుసగుసలు
ఏవేవో కోరికలు..
ఏవేవో కోరికలు
చరణం::2
పూల పల్లకిలోన..తేలిపోయే సమయాన..ఆ
పూల పల్లకిలోన..తేలిపోయే సమయాన..ఆ
బుగ్గల సిగ్గులు తొణకాలని..
అవి నీకే నీకే ఇవ్వాలని
ఏవేవో కోరికలు..
ఏవేవో కోరికలు
వెన్నెలలో మల్లియలు..
మల్లెలలో ఘుమఘుమలు
ఘుమఘుమలో..
గుసగుసలు
ఏవేవో కోరికలు..