Showing posts with label హరిణి. Show all posts
Showing posts with label హరిణి. Show all posts

మాఘమాస వేళ వచ్చె


మాఘమాస వేళ వచ్చె 
ఇదే నా మొదటి ప్రేమలేఖ (2001)
రచన: చంద్రబోస్   
సంగీతం: ఘంటాడి కృష్ణ 
గానం: మనో, హరిణి  

సాకీ: 

పట్టుచీర కట్టుకోని 
పారాణి దిద్దుకోని 
చుక్కలన్ని కోసుకొచ్చి 
కొప్పునిండ పెట్టుకోని  
మెరిసేటి మేఘాన్ని 
కాటుకల్లె దిద్దుకోని
పందిట్లొ అడుగుపెట్టె 
పెళ్ళికూతురు... 

లాలి లాలి అను రాగం


లాలి లాలి అను రాగం
ఇందిర(1995)
రెహమాన్
హరిణి, కోరస్

లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే...

ఆ..ఆ..ఆఅ
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవరూ నిదురపోరే
చిన్న పోదామరి చిన్నిప్రాణం

కాసే వెన్నేలకు వీచే గాలులకు హృదయం కుదుట పడకే
అంత చేదా మరి వేణు గానం

కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా
ఆ పగటి బాధలన్ని మరిచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ

ఓ సుకుమారి ఓ శృంగారి



కుమారి
చిత్రం : అపరిచితుడు (2005)
సంగీతం : హ్యారిస్ జయరాజ్
సాహిత్యం : చంద్రబోస్
గానం : శంకర్ మహదేవన్,హరిణి

షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో
ఓ సుకుమారి ఓ శృంగారి నా అలంగారిణి /2/

ఓ సుకుమారి..................
ఓ సుకుమారి ఓ శృంగారి
ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి ఏ కుమారి
కుమారీ...నా ప్రేమే వెక్కిముక్కి బక్క సిక్కెనె
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి కృంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే /2/

నే ఓడిపోయాననుకుంటానే
నా ప్రేమను కాస్తా వాయిదా వే స్తినే
రఘుమారి సుకుమారీ నా మనసొక విరినడి విరులలో అలజడి
కుమారీ...నా ప్రేమే వెక్కిముక్కి బక్క సిక్కెనె
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి కృంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే
షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో /2/

తొలి ప్రేమ అంటే పెనుభారమా
ఇది కానువు రాని నిండు గర్భమా
ప్రేమ గుట్టు దాస్తే బరువోపలేకా ఊపిరి ఆగదా ఊర్వశి
ప్రేమని తెలిపి కాదని అంటే ప్రేమే సచ్చిపోదా ప్రేయసీ
ప్రేమలేఖతో అయినా మా మదిలో వున్నది పూర్తిగ సెప్పలేము కదే
నువ్వు కళ్ళు మూసుకుంటే ప్రేమను తెలిపే వేరొక మార్గం లేదే
కుమారీ...కుమారీ....ఆ ఆ ఆ ఆ

ప్రేమ భాషే రాని మూగ వాడినే
వాడి పోవుచున్నా ఇట చూడవా
దోసిలి నిండా పువ్వులు నిండీ గువ్వల కోసం ఎతికినా
పువ్వుల నొసగి పూజను సేసి కోరిక అడుగుట మరిసినా
ఆ దేవునికన్నా బలమగువాడు వేరొకడున్నాడులే
కళ్ళను చూసి వలపును తెలిపే ధైర్యం గలవాడతడే అతడే ఓ కుమారీ
కుమారీ...నా ప్రేమే వెక్కిముక్కి బక్క సిక్కెనె
కుమారీ...నా గుండె గొప్పి రోప్పి కృంగుసున్నదే
కుమారీ...నా మాటల కడలీ మండే ఎండేనే /2/

కుమారా ...నీ ప్రేమ వెక్కిముక్కి బక్క సిక్కెనా
కుమారా ...నీ గుండె గొప్పి రోప్పి కృంగుచున్నదా
కుమారా ...నీ మాటల కడలీ మండే ఎండేనా?

నే ఓడిపోయాననుకుంటానే
నా ప్రేమను కాస్తా వాయిదా వే స్తినే
రఘుమారి సుకుమారీ నా మనసొక విరినడి విరులలో అలజడి

షంజానే తోనే తానీ నేనానో
అవ తుంబకతానే అంబి లంబానో /2/

అలై పొంగెరా

అలై పొంగెరా
చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : హరిణి , కల్పన , కళ్యాణి మీనన్

అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది
అలై పొంగెరా కన్నా ... అ అ అ

నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రాదొరా ప్రాయమున
యమున మురళీధర యవ్వన
అలై పొంగేరా కన్నా ... అ అ అ

కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమునా కనుబొమ్మలటు పొంగే

కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే

అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీచ శకుంతమరంద మెడారి గలాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా

కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో

ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులె చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా కన్నా ... అ అ అ

ఏమంటారో నాకు


ఏమంటారో నాకు
గుడుంబా శంకర్ (2004)
ఎస్పీ చరణ్, హరిణి
సిరివెన్నెల
మణిశర్మ

ఏమంటారో నాకు నీకు ఉన్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని
చూసే పెదవిని మాటాడే కనులని
నవ్వే నడకని కనిపించే శ్వాసనీ
ఇచ్చిపుచ్చుకున్న మనసుని
ఇదా అదా యధావిధా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

ఎదురుగా వెలుగుతున్న నీడని
బెదురుగా కలుగుతున్న హాయిని
తనువునా తొణుకుతున్న చురుకుని
మనసునా ముసురుకున్న చెమటని
ఇష్టకష్టాలని ఇపుడేమంటారో
ఈ మోహమాటాలని మరి ఏమంటారో
స్వల్ప భారాలని ఇపుడేమంటారో
సమీప దూరాలని అసలేమంటారో
జారే నింగిని దొరలాంటి ఈ దొంగని
పాడే కొంగుని పరిమళించే రంగుని
పొంగుతున్న సుధా గంగని ఇదా అదా అదే ఇదా మరి
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

జాబిలై తణుకుమన్న చుక్కని
భాద్యతై దొరుకుతున్న హక్కుని
దేవుడై ఎదుగుతున్న భక్తుని
సూత్రమై బిగియనున్న సాక్షిని
పాతలో కొత్తని ఇపుడేమంటారో
పోట్లాటలో శాంతిని మరి ఏమంటారో
తప్పులో ఒప్పుని ఇపుడేమంటారో
గతజన్మలో అప్పుని అసలేమంటారో
నాలో నువ్వుని ఇక నీలో నేనుని
మాకే మేమని మనదారే మనదనీ
రాసుకున్న ఆత్మచరితని అదా ఇదా ఇదే అదా మరి
ఏమంటారో నాకు నీకున్న ఇదిని
ఏమంటారో నువ్వు నేనైన అదిని
ఏమంటారో మారిపోతున్న కథని
ఏమంటారో జారిపోతున్న మతిని

సోనియా... సోనియా...


సోనియా...
చిత్రం: రక్షకుడు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి

సోనియా... సోనియా...
సోనియా సోనియా
సోనియా... సోనియా

పల్లవి:

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
హే సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

చరణం: 1

పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే
చెక్కిళ్ళు తడితే అది నీటు
కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే
ఒడి చేర్చుకుంటే అది నాటు
పచ్చిక మీద పడే చినుకుల మల్లే
చిరుముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు
కసిగా మీద పడే ఉప్పెన మల్లే
చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు
నీ కురుల మీద పువ్వును నేనై
మురిపించే యాటలాడించనా
మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే
మంచంలో మాటలకీ చోటేముందే
మత్తెక్కే కౌగిట్లో ముంచేస్తా అమ్మడు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రెండిట్లో ఏది నాకు ప్యారు

చరణం: 2

ఊరించే ఒడిలో ఉప్పొంగే తడిలో
బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే
పరువాల పిలుపే కళ్ళల్లో మెరుపై
గుండెల్లో సెగలే రగిలిస్తుంటే
కౌగిలి క్రికెట్ కి సిస్టమ్ లేదే
అంపైరు లేడే మగతనముంటే చాలే
పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా
ఎద మల్లెల పూమాలోయ్
నలిపేకపోతే అందం లేదే
కసిలేని మోహం మోహంకాదే
కోమలితో వాదిస్తే అర్థముందా
కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా
ప్రేయసిని గెలిచేది నాజూకు తనమేగా

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

సోనియా... సోనియా... సోనియా...

అందాల రాక్షసివే



అందాల రాక్షసివే
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఏ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: హరిణి, యస్. పి. బాలు

అందాల రాక్షసివే
గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా
చిలకా రామ చిలకా
మొలకా ప్రేమ మొలకా

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే

సూర్యుణ్ణి  రెండు చేసి కళ్ళలోన దాచుకుందో అహ...ఓ
చందురుణ్ణి కంటిపాపలోన తాను ఉంచుకుందో ఓ...
రాతిరిని పట్టుకొచ్చి కాటుకల్లె పెట్టెదనా అహ...ఓ
మిణుగురులు అంటించి బుగ్గలకు నిగ్గు తేనా ఓ...
పొగడి నను రెచ్చగొట్టి నిద్ర చెడగొట్టకయ్యా
తలగడగా నాకొక్కా పంచె నువ్వీయవయా కనులా కునుకే కలయా
చిలకా రామ చిలకా
మొలకా ప్రేమ మొలకా

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే

కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుందాం
కొండపల్లి బొమ్మతోటి జంటచేరి ఆడకుందాం

తేనెపట్టు పట్టుబట్టి పాడు చేయ శపథమా అహ...ఓ
ప్రేమంటే పార్టీ విడిచీ పార్టీ మార్చు విషయమా ఓ...
కన్నెపిల్ల సైగ చేస్తే తలక్రిందులౌదువా అహ...ఓ
నే నడుచు నీడలోన నీవుండ సమ్మతమా
నేగనక నీరైతే నీ నుదుటపై నే జారి
అందాల నీ ఎదపై హుందాగ కొలువుంటా
కానీ అన్నీ కలలే
చిలకా రామ చిలకా
మొలకా ప్రేమ మొలకా

అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే
మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే
కొడవలితో కసిగా మనసే కోశావే
గడ్డి మొక్కకు కోత తెలియునా బాలకొమరినే కానా
నీటి కొంగను చేప మింగునా జరుగునా
బైట పూసినా లోన కాసెడి శనగ తోటను మామా
మెలిక తిప్పుతూ కాయలొలిచెడి తుంటరి సుమా