Showing posts with label ఉన్ని కృష్ణన్. Show all posts
Showing posts with label ఉన్ని కృష్ణన్. Show all posts

తెలుగు ఇంటి పెరటిలోన

చిత్రం: పరదేశి (1998)
రచన: చంద్రబోస్ 
సంగీతం: కీరవాణి
గానం: ఉన్ని కృష్ణన్, చిత్ర 

పల్లవి: 

తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా
చిగురుమావి గుబురులోని కుహుకుహూల రాగమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ 
దట్ ఐ యామ్ ఫాలింగ్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ ఊరి గాలి మంచికబురు తెచ్చింది
కోరుకోని కాలమేమో కలిసొచ్చింది

నయగారా దారుల్లో ఉరికే జలపాతమా
న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా
ఐ యామ్ ఫీలింగ్ ఫీలింగ్ ఫీలింగ్ 
దట్ ఐ యామ్ ఫాలింగ్ ఇన్ లవ్
అహ ప్రేమ ప్రేమ ప్రేమ అంటూ
ఐ వాంట్ టు లివ్
ఈ చిన్నిమాట నాకు భలే నచ్చింది
ఇంత వరకు లేని హాయి తెలిసొచ్చింది

అఖిల చరాచర

అఖిల చరాచర
చిత్రం : జగద్గురు ఆదిశంకర (2013)
సంగీతం : నాగ శ్రీవత్స
గానం: ఉన్ని కృష్ణన్ 
రచన: శ్రీ వేదవ్యాస్

కృష్ణా.... ద్వారకావాసా 
అఖిల చరాచర జగద్జాలముల అనాది అత్మల సాక్షిగా 
అంతట నీవే ఉండీ లేవను ఉజ్వల భావం ఊపిరిగా 
నింగీ నేలా నీరూ నిప్పూ గాలి కలయికల కాపరిగా 
నీ ఆటే ఆటగ పాటే పాటగ సృష్టి  స్థితి లయ,
విన్యాసలయల, ఆవల ఈవల అలరారే నీ లలితా
నృతరస లహరుల లీల, లీలాకృష్ణ చూపరా.     
అమ్మకు చూపరా....

సరిగమ పమ రిస సరిమ, 
మప నిద నిని స, 
నిసరిప మపగమ రిస నిస రిస నిస రిస నిస నిప 
మప గమ రిస నిని స

నాతోనే ఉన్నావు

నాతోనే ఉన్నావు 
చిత్రం : సత్య (1998)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఉన్ని కృష్ణన్, సుజాతా మోహన్ 

పల్లవి: 

నాతోనే ఉన్నావు 
నాతోడై ఉన్నావు 
ఐనా నీ నిరీక్షణ 

స్నేహితుడే ఉంటే..


స్నేహితుడే ఉంటే..
నీ మనసు నాకు తెలుసు (2003)
చిన్మయి, మనో, ఉన్నికృష్ణన్
ఎ. ఆర్. రెహమాన్
రత్నం, శివగణేష్

స్నేహితుడే ఉంటే
ఒక స్నేహితుడే ఉంటే
చేతులతో భూమిని మొయ్యొచ్చు
ఆకాశం అంచులనే
తాకేద్దాం మిత్రమా

సువ్వి సువ్వమ్మ సువ్వి


సువ్వి సువ్వమ్మ సువ్వి
చిత్రం : ఆహా (1998)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : ఉన్నికృష్ణన్, సుజాత
రచన: సిరివెన్నెల

సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి ఆహా........
సువ్వి సువ్వమ్మ సువ్వి సువ్వి........
నవ్వులైన ఏడుపైన తడిసేను కన్నులే....... 

ఇప్పటికిప్పుడు రెప్పల్లో


ఇప్పటికిప్పుడు రెప్పల్లో
ప్రేమకు వేళాయెరా(1999)
చిత్ర, ఉన్ని కృష్ణన్,
ఎస్.వి. కృష్ణారెడ్డి

ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెనలో

ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఊవిళ్లో
మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే
సరదాల సందడి
ప్రేమకి వేళయిందని తరిమి తడిమే
తరుణాల తాకిడి

ఏం చేయమంది కొంటె అల్లరి
ఆ మాట చెప్పదు ఎలా మరి
మాటలేవి వద్దు చేరుకోమని
చిలికి చినికి ఉలికి పడే
చిలిపి వలపు చినుకు సడి

ప్రతి దినం నీ దర్శనం


ప్రతి దినం నీ దర్శనం
చిత్రం : అనుమానాస్పదం (2007)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వంశీ
గానం : ఉన్నికృష్ణన్, శ్రేయాఘోషల్

నానాన..ననన..నానాన..
నానాన..ననన..నానాన..
ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

ప్రతి దినం నీ దర్శనం మరి దొరకునా..దొరకునా..
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా..జరపనా..
నిను చూడలేని రోజు నాకు రోజు కాదు..

ఎంతెంత దూరం? తీరం రాదా

ఎంతెంత దూరం? తీరం రాదా
సైనికుడు (2006)
వేటూరి
హ్యారిస్ జయరాజ్
బాలు, ఉన్నికృష్ణన్

ఎంతెంత దూరం తీరం రాదా 
ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా
ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమగాధ 
నీ వైపు మళ్ళిందంటే మాయేగా
మాయేరా మాయేరా ప్రేమ అన్నది మాయేలేరా 
ఊరించే ఊహాలోకం లేరా
మాయేరా మాయేరా రంగురంగులూ చూపేదేరా 
రంగంటూ లేనేలేదు లేరా

ఊహల్లో ఊసుల్లో ఆమాటే ఓసోసి గొప్ప ఏముంది గనకా
తానంటూ నీవెంటే ఉందంటే ఆ ఎండ కూడా వెండివెన్నెలవదా
అవునా అదంత నిజమా ఏదేది ఓ సారి కనపడదా
ఇలలో ఎందెందు చూసినా అందందునే ఉంటుందిలే బహుశా
మాయేరా మాయేరా ప్రేమ ఎక్కడో లేదూ లేరా నీ చెంతే ఉండే దూరం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ప్రేమిస్తే ఎంతైనా వింతేలే నువ్వు ఎంత చెప్పు గుండెల్లో గుబులే
ఈడొస్తే ఈగైనా ఇంతేనా ఇంతోటి తీపి ఏమున్నదైనా
శిలవా నా మాట వినవా ఏనాడు నువ్వు ప్రేమలో పడవా
నిజమా ఈ ప్రేమ వరమా కల్లోనైన ఊహించని మహిమా
మాయేరా మాయేరా ప్రేమ అన్నదీ మాయేలేరా ఇద్దరిలోనా ఇంద్రజాలం లేరా
హాయీరే హాయీరే ఎల్లలన్నవీ లేనే లేవే ప్రేమిస్తే లోకం మొత్తం హాయే

ఎంతెంత దూరం తీరం రాదా ఇంకెంత మౌనం దూరం కాదా
ఏనాడూ ఏకం కావు ఆ నింగీ నేలా ఈనాడు ఏకం అయితే వింతేగా
ఏ రోజు ఏమవుతుందో ఈ ప్రేమ గాధ నీవైపు మళ్ళిందంటే మాయేగా

రోజా... రోజా... ప్రేమికుల రోజు

రోజా... రోజా...
ప్రేమికుల రోజు (1999)
రెహమాన్
ఉన్నికృష్ణన్
ఏ.ఎమ్.రత్నం, శివగణేష్

రోజా... రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా..
నిను గాలిసోకగా వదలనులే..
నెలవంక తాకగా వదలనులే..
ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే..
నే ఓర్వనులే నే ఓర్వనులే..
రోజా రోజా...రోజా రోజా...
కన్నులలో కొలువున్నావులే..
రాతిరిలో కనులకు కునుకే లేదులే..
వలువుగ నన్ను చుట్టుకోగా నీ సన్నని..
నడుముకు కలుగును గిలిగిలి నా రోజా..
నీ పేరు నా నోట నే చెప్పగా..
నా ఇంట రోజాలు పూచేనులే..
నీ జాడ ఒకరోజు లేకున్నచో..
నీ చెలియ ఏదంటూ అడిగేనులే..
నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే..
వానలో తడవగా నాకొచ్చునే జ్వరం..
ఎండలో నువు నడవ గా నాకు పట్టె స్వేదం..
తనువులే రెండు హృదయమే ఒకటి ...రోజా...రోజా...రోజా..
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా...

నవ యువతి నడుమొక గ్రంథము..
చదివైనా పలుచని రాత్రులు మంచులో..
దూరాలేలా జవరాలా బిడియాన్ని..
ఒకపరి విడిచిన మరి తప్పేముంది..
నన్నే నువ్వు తాకొద్దని..
గగనాన్ని ఆపేనా ఆ సాగరం..
నన్నే ముట్టుకోవద్దని..
చేతులకు చెప్పేనా ఆ వేణువు..
నీ స్పర్శే చంద్రుని మచ్చను మాపులే..
కనులలో జారెడు అందాల జలపాతమా..
నన్ను నువు చేరగా ఎందుకాలోచనా..
నీ తలపు తప్ప మరు ధ్యాసలేదు..
నా రోజా..రోజా..రోజా...
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...
నిన్ను చూసి నన్ను నేను..
మరచిపోయి తిరిగి వచ్చా..
రోజా రోజా రోజా రోజా...రోజా రోజా రోజా రోజా...

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో


ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో
చిత్రం : ఉగాది (1997)
సంగీతం : ఎస్వీ. కృష్ణారెడ్డి
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఉన్నికృష్ణన్ , బృందం

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
ఇవ్వాళే చూశా నిన్ను బాగున్నావా
వెన్నెల గువ్వా...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ
నడపమందువా
కాచుకుంది పూవుల తోవ
చూపిస్తా నాతో రావా

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వేచి ఉంది నవ్వుల నావ
వెన్నెల గువ్వా వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా

కళ్లు మూసుకోగానే ఎన్ని కలలు వస్తాయో
వాటి వెంట పోతూ రోజూ చూస్తానే నీ కోట
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కళ్లు తెరుచుకోగానే దారి మరిచిపోతానే
కోటి చుక్కలన్నిటి మధ్య నీకోసం చూస్తుంటా
కరిగేటి కలవో నిజంగానే కలవో
అనుమానం తీర్చేయాలని కళ్లారా కనిపించేవా

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ ...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ

ఊసుపోని ఊహల్లో ఊయలూగు వేళల్లో
పాడుకుంటు ఉంటే నువ్వా రాగాలే విన్నావా
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
చుక్కలూరి వీధుల్లో ఒక్కదానివై ఉంటే
తోచుబాటు ఏమీ లేక ఈ వైపు వాలేవా
నువు రాక మునుపే నీ రూపు తెలుసే
ఎలాగంటే నాకేం తెలుసు
నా మనస్సుకి కబురంపేవా

ఇన్నాళ్లూ ఏ మబ్బుల్లో దాగున్నావో
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
వేచి ఉంది నవ్వుల నావ ...
వెన్నెల గువ్వా... వెన్నెల గువ్వా
కాచుకుంది పూవుల తోవ

గోవింద గోవిందయని కొలువరే

రేకు                : 01
సంపుటము   : 10
సంకీర్తన         : 02
రాగం              : బౌళి
తాళం             : ఆది
గానం             :  శ్రీ P. ఉన్ని కృష్ణన్ గారు

పల్లవి:

గోవింద గోవిందయని కొలువరే
గోవిందాయని కొలువరే

చరణము 1

హరియచ్యుతాయని పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు

చరణము 2

పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు

చరణము 3

దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు

ఓ చెలియా


ఓ చెలియా
చిత్రం: ప్రేమికుడు (1994)
రచన: రాజశ్రీ
సంగీతం: రెహమాన్
గానం: ఉన్ని కృష్ణన్

పల్లవి : 

ఓ చెలియా ..
నా ప్రియసఖియా .. 
చెయ్ జారెను నా మనసే..
ఏ చోటా అది జారినదో 
ఆ జాడే మరిచితినే...
నీ అందెలలో చిక్కుకుంది అని 
నీ పదముల చేరితినే...

ప్రేమంటే ఎన్ని అగచాట్లో 
మన కలయిక తెలిపినదే..
నా గుండెలలో ప్రేమ పరవశమై.. 
ఇరు కన్నులు సోలెనులే..ఏ..
ఓ చెలియా 
నా ప్రియసఖియా 
చెయ్ జారెను నా మనసే...

చరణం 1:

ఈ పూటా చెలి నా మాట  
ఇక కరువై పోయెనులే
అధరము ఉదరము నడుమను 
ఏదో అలజడి రేగెనులే...

వీక్షణలో నిరీక్షణలో 
అరక్షణమొక యుగమేలే
చూపులన్ని వెంటాడినట్టు 
మది కలవరమాయెనులే

ఇది స్వర్గమా..నరకమా...
ఏమిటొ తెలియదులే
ఈ జీవికి జీవన మరణము  
నీ చేతిలొ ఉన్నదిలే..ఏ..ఏ...
ఓ చెలియా 

చరణం 2:

కోకిలమ్మా నువు సై అంటే 
నే పాడేను సరిగమలే
గోపురమా నిను చేరుకుని 
సవరించేను నీ కురులే..

వెన్నెలమ్మా నీకు జోలపాడి 
కాలి మెటికలు విరిచేనే..
వీచేటి చలిగాలులకు 
తెరచాపై నిలిచేనే...

నా ఆశలా ఊసులే 
చెవిలోన చెబుతానే
నీ అడుగులా చెరగని గురుతులే 
ప్రేమచరితలు అంటానే
ఓ చెలియా నా ప్రియసఖియా 

హైర హైర హైరబ్బా...

హైర హైర హైరబ్బా...
జీన్స్ (1998)
రచన: రత్నం, శివ గణేష్
సంగీతం: రెహమాన్
గానం: ఉన్ని కృష్ణన్, పల్లవి

నాకే నాకా నాకే నాకా
నువ్వు నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
హార్ట్ సైజు వెన్నెలలు నాకే నాకా
ఫ్యాక్స్‌లొచ్చిన శ్రీ కవిత నాకే నాకా
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచేనా
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
పట్టు పూవా పుట్ట తేనా
నీ నడుం సగం తాకనివ్వవా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా

కలిసి ఇద్దరం చిరునడకలతో అమెరికానే తిరిగొద్దాం
కడలిపై ఎరట్రి తివాచీ పరచి ఐరోపాలో కొలువుందాం
మన ప్రేమనే కవి పాడగా
షెల్లీకి బైరన్‌కూ సమాధి నిద్దర చెడగొడదాం
నీలాకాశమే దాటి ఎగరకు ఏమైనదో నీ మనసుకు ఉల్లాసమో.. ఉత్సాహమో..
ప్రేమ పిచ్చితో గాలై తిరగకు ఏమైనదో నీ వయసుకు ఆయాసమో.. ఆవేశమో..
పైర గాలికి వయసాయే నేలతల్లికి వయసాయే
కోటియుగాలైనాగానీ ప్రేమకు మాత్రం వయసైపోదు
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...

చెర్రి పూలను దోచేగాలి చెవిలో చెప్పెను ఐలవ్‌యూ
సైఫ్రస్ చెట్లలో దావో పక్షి నాతో అన్నది ఐలవ్‌యూ
నీ ప్రేమనే నువు తెలుపగ
గాలులు పక్షులు ప్రేమ పత్రమై కుమిలినవో
ఒంటి కాలితో పూవే నిలిచెను నీ కురులలో నిలిచేందుకే
పూమాలవో పూవెట్టనా
చిందే చినుకులు నేలవాలెను నీ బుగ్గలే ముద్దాడగా
నేను నిన్నూ ముద్దాడనా
హృదయ స్పందన నిలిచె నువు ప్రాణముండును ఒక నిమిషం
ప్రియా నన్ను నువ్విడిస్తే మరుక్షణం ఉండదు నాప్రాణం
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
ఫిఫ్టి కేజి తాజ్‌మహల్ నాకే నాకా
ఫ్లైట్ తెచ్చిన నందవనం నాకే నాకా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా...
హార్ట్ సైజు వెన్నెలలు నీకే నీకు
ఫ్యాక్స్‌లొచ్చిన శ్రీ కవిత నీకే నీకు
నిన్ను నేను కప్పుకొనేనా
పెదవిపైనే పవళించేనా
ముద్దుల వానలో నిను తడిపేనా
కురులతోటి తడి తుడిచేనా
పట్టు పూవా పుట్ట తేన
నీ నడుం సగం తాకనివ్వవా
హైర హైర హైరబ్బా... హైర హైర హైరబ్బా

సోనియా... సోనియా...


సోనియా...
చిత్రం: రక్షకుడు (1997)
సంగీతం: ఏ.ఆర్.రెహమాన్
సాహిత్యం: భువనచంద్ర
గానం: ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్, హరిణి

సోనియా... సోనియా...
సోనియా సోనియా
సోనియా... సోనియా

పల్లవి:

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
హే సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

చరణం: 1

పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లే
చెక్కిళ్ళు తడితే అది నీటు
కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లే
ఒడి చేర్చుకుంటే అది నాటు
పచ్చిక మీద పడే చినుకుల మల్లే
చిరుముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు
కసిగా మీద పడే ఉప్పెన మల్లే
చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు
నీ కురుల మీద పువ్వును నేనై
మురిపించే యాటలాడించనా
మృదువైన ముద్దుల్లో సొగసే ఉందే
మంచంలో మాటలకీ చోటేముందే
మత్తెక్కే కౌగిట్లో ముంచేస్తా అమ్మడు

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రెండిట్లో ఏది నాకు ప్యారు

చరణం: 2

ఊరించే ఒడిలో ఉప్పొంగే తడిలో
బుగ్గల్ని ఎంచక్కా పిండేస్తుంటే
పరువాల పిలుపే కళ్ళల్లో మెరుపై
గుండెల్లో సెగలే రగిలిస్తుంటే
కౌగిలి క్రికెట్ కి సిస్టమ్ లేదే
అంపైరు లేడే మగతనముంటే చాలే
పట్టీ పడదోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా
ఎద మల్లెల పూమాలోయ్
నలిపేకపోతే అందం లేదే
కసిలేని మోహం మోహంకాదే
కోమలితో వాదిస్తే అర్థముందా
కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా
ప్రేయసిని గెలిచేది నాజూకు తనమేగా

సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా
రేగుతోందే లేత వయసు జోరు
ఘాటు లవ్వు రెండు టైపు
నీటుదొకటి నాటుదొకటి
రెండిట్లో ఏది నాకు ప్యారు
సమ్ టైమ్స్ నీటే స్వీటు
సమ్ టైమ్స్ నాటే రైటు
పిల్లా కళ్ళను చూసే
చేసెయ్ గురువా ఫైటు

సోనియా... సోనియా... సోనియా...