January 1, 2020

ఏ స్వప్నలోకాల


ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
సుస్వాగతం(1998)
బాలు, చిత్ర
సిరివెన్నెల
ఎస్. ఏ. రాజ్ కుమార్

పల్లవి : 

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

ఏ స్వప్నలోకాల సౌందర్యరాశి
నా ముందుకొచ్చింది కనువిందుచేసి
ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి
ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి

తళతళ తారక 
మెలికల మేనక
మనసున చేరెగా 
కళగల కానుక
కొత్తగా కోరిక చిగురులు వేయగా

చరణం 1:

తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా...
తొలిచూపు చాలంట చిత్తాన చిత్రంగ ప్రేమనేది పుట్టగా...
పదిమంది అంటుంటె విన్నాను ఇన్నాళ్ళు నమ్మలేదు బొత్తిగా
ఆ కళ్ళలో ఆ నవ్వులో 
మహిమ ఏమిటో
ఆ కాంతిలో ఈనాడె నా 
ఉదయమైనదో
మధుసీమలో ఎన్ని మరుమల్లె గంధాలు
మునుపెన్నడూలేని మృదువైన గానాలు
మొదటి వలపు కథలు తెలుపు 
గేయమై తీయగా స్వరములు పాడగా

చరణం 2:

మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయకా
మహరాణి పారాణి పాదాలకేనాడు మన్నునంటనీయక
నడిచేటి దారుల్లో నా గుండె పూబాట పరుచుకుంది మెత్తగా
శాంతికే ఆలయం ఆమె నెమ్మది
అందుకే అంకితం అయినదీ మది
సుకుమారమే ఆమె చెలికత్తె కాబోలు
సుగుణాలకే ఆమె తలకట్టు కాబోలు
చెలియ చలువ చెలిమి కొరకు
ఆయువే ఆశగా 
తపములు చేయగా