Showing posts with label విజయ్ ఏసుదాస్. Show all posts
Showing posts with label విజయ్ ఏసుదాస్. Show all posts

నింగి చుట్టే


నింగి చుట్టే
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020)
రచన: విశ్వా      
గానం: విజయ్ ఏసుదాస్ 
సంగీతం: బిజీబల్  

పల్లవి : 

నింగి చుట్టే 
మేఘం ఎరుగద
ఈ లోకం గుట్టు 
మునిలా.. 
మెదలదు నీమీదొట్టు

చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ

చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
శ్రీ రామదాసు (2006)
కీరవాణి
చిత్ర, విజయ్ ఏసుదాస్

చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ
వారధి కట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా
నీ దివ్య చరణములే నమ్మితీ
చరణములే నమ్మితీ

పావన రామ నామసుధారస పానము చేసేదెన్నటికో
సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా

చంచలగుణములు మాని సదా నిశ్చల మదియుండేదెన్నటికో
పంచతత్వములు తారకనామము పఠియించుట నాకెన్నటికో
రామ రామ జయ సీతారామా రఘుకులసోమ రణభీమా
రామ రామ జయ సీతారామా జగదభిరామా జయరామా

నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
జలజ సంభవాది వినుతా
చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధ వదనా నళినా మిళిందం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం
నందబాలం భజరే నందబాలం
బృందావన వాసుదేవ బృందలోలం

శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
గోవిందునీవేళ కొలుతాం కొలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
దేవుని గుణములు తలుతాం తలుతాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
విష్ణు కధలు చెవుల విందాం విందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
వేరు కధలు చెవిన మాందాం మాందాం
శ్రీరామ నామం మరువాం మరువాం
సిద్దము యమునికి వెరువాం వెరువాం

హే జై జై రామ జానకి రామ
జై జై రామ జానకి రామ
పావన నామ పట్టాభి రామ
పావన నామ పట్టాభి రామ
నిత్యము నిన్నే కొలిచెద రామ
అహ నిత్యము నిన్నే కొలిచెద రామ
ఆహా రామా అయోధ్య రామ
ఆహా రామా అయోధ్య రామ
రామా రామా రఘుకుల సోమా
అహ రామా రామా రఘుకులసోమా
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ
జై జై రామ జానకిరామ

నీ కంటి చూపుల్లోకి

నీ కంటి చూపుల్లోకి
లెజెండ్ (2014)
రామజోగయ్య శాస్త్రి
దేవిశ్రీ ప్రసాద్
విజయ్ ఏసుదాస్, చిత్ర

నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే...
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే...
సమయమే ఇక తెలియనంతగా మనసు నటుయిటు కమ్మేసావే...
పలుయుగాలకు తనివి తీరని కలల తలుపులు తెరిచినావే...
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే...
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే ఓ...

చూసే కొద్ది చూడాలంటూ చూపు నీ వైపు పోనీకుండా పట్టేసావే...
ఇచ్చే కొద్ది ఇవ్వాలంటూ నాకై నేనే నువ్వైపోయేలా చుట్టేసావే...
ఒంటరైన లోకం నిండిపోయే నీవుగా...
ఇప్పుడున్న కాలం ఎప్పుడైన లేదుగా...
ఊపిరిలో చిరునవ్వల్లె నీకోసం నేనే ఉన్నా...
నా ప్రేమదేశం నీకు రాసిచ్చుకున్నా...
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే...
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమేసావే ఓ...

ఏదో ఉంది ఎంతో ఉంది సూటి బాణాలు గుప్పించేటి నీ రూపులో...
నాదేముంది అంతా నీది మెరుగు పెట్టావే అందాన్నిలా నీ చూపుతో...
చిచ్చుపెట్టినావే వెచ్చనైన శ్వాసలో...
గూడుకట్టినావే గుప్పెడంత ఆశలో...
తెల్లారే ఉదయాలన్నీ నీతోనే మొదలైపోనీ...
నీ జన్మ హక్కైపోని నా రోజులన్నీ...
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే ఏ మాయ చేసావే...
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే ఏం మంత్రమే...సావే

తెలవారితే కనురెప్పల తొలి

తెలవారితే
చిత్రం : ప్రేమమ్ (2016)
సంగీతం : రాజేష్ మురుగన్
సాహిత్యం : శ్రీమణి
గానం : విజయ్ ఏసుదాస్

తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే
నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే
పొలమారితె నీ మనసుకి అది నా పొరపాటే
నీ పేరే పలకడమే పెదవులకలవాటే

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నామాటే

ఎవరే.. ఎవరే ప్రేమను మాయంది..
ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ..

ఎవరే నిన్నే నా వైపు నడిపే
నా ఊహల మధురోహల హరివిల్లు నింపే
తియ్య తియ్యని నిముషాలే నీలోన ఒంపే
నా ఒంటరి కాలాన్నే నీతోన చెరిపే..
ఆ దైవమే నాకు చెప్పింది ఎపుడో
నీ చిన్ని చిరునవ్వె విలువైన వరమంటూ
నా ప్రాణమే నీకు చెబుతోంది ఇపుడూ
నువు లేక నే లేననీ ..

గదిలాంటి మదిలో నదిలాంటి నిన్నే
దాచేయాలనుకుంటే అది నా అత్యాశే
అడుగంత దూరం నువు దూరమైనా
నా ఊపిరి చిరునామా తెలిపేదెవరే..

ఎవరే..

వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే
వేకువలా చూస్తోందే నువు నడిచిన బాటే
ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే
నా మనసే నీదయ్యే వినదే నామాటే
ఎవరే.. ఎవరే ప్రేమను మాయంది..

ఎవరే.. ఈ హాయికి హృదయము చాలందీ..
ఓఓ...ఓఓఓ...ఓఓఓ...ఓఓ...