Showing posts with label హేమచంద్ర. Show all posts
Showing posts with label హేమచంద్ర. Show all posts

నాలో నేనేనా.. ఏదో అన్నానా..


నాలో నేనేనా.. 
చిత్రం : బాణం (2009)
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : హేమచంద్ర , సైంధవి

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
విన్న మాటేదో నిన్నడగనా ||నాలో నేనేనా||

అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ.. మాటే నీదీ..
ఇదేం.. మాయో...

నీ కళ్ళలోన కాటుక


నీ కళ్ళలోన కాటుక
జై లవ కుశ (2017)
చంద్రబోస్
దేవిశ్రీప్రసాద్
హేమచంద్ర

నీ కళ్ళలోన కాటుక ఓ నల్ల మబ్బు కాగా
నీ నవ్వులోని వేడుక ఓ మెరుపు వెలుగు కాగా
నీ మోము నింగినుండి ఓ ప్రేమ వాన రాగా
ఆ వానజల్లులోన నేను జల్లుమంటు తడిసిపోగా...ఆ ఆ ఆ ఆ
తేలి తేలి తేలి తేలి తేలి తేలి తేలి పోయా
ఓ ప్రేమవానలోన మునిగి పైకి పైకి తేలిపోయా

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా


గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా
చిత్రం: క్లాస్ మేట్స్ (2007)
సంగీతం: కోటి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: హేమచంద్ర

పల్లవి:

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ.. 
నిన్ను కలుసుకోనీ

గుండె చాటుగా ఇన్నినాళ్ళుగా ఉన్న ఊహలన్నీ
ఉన్నపాటుగా హంసలేఖలై ఎగిరి వెళ్ళిపోనీ... 
నిన్ను కలుసుకోనీ
నిన్ను కలుసుకోనీ... విన్నవించుకోనీ... 
ఇన్నాళ్ళ ఊసులన్నీ

తెలుగు పాటకు పట్టిన తెగులు


తెలుగు పాటకు పట్టిన తెగులు
సుడిగాడు (2012)
చంద్రబోస్
శ్రీవసంత్
హేమచంద్ర, అల్లరి నరేష్, గీతామాధురి

జర జర జర జర జర జరా
రింగ రింగ రింగ రింగ జర జరా
షకలక షకలక జర జరా
చిక్కు బుక్కు చిక్కు బుక్కు జజ్జనక జజ్జనక జర జరా
ముక్కాలా ముకాబులా ముస్తఫా ఊలా లలా
సారొస్తా రొస్తా రొస్తా జింతాతా చితా చితా
కోలావెర్రి ... కోలావెర్రి బల్లెలక్కా బైల బల బలమ్మొ
డోలె డోలె కీళీ మాంజారో రిపీట్ట్

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం

హృదయం ఓర్చుకోలేనిదీ
పరుగు (2008)
మణిశర్మ
సిరివెన్నెల
హేమచంద్ర

హృదయం ఓర్చుకోలేనిదీ
హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం
పెదవులు విడిరాదా
నిలువవే కడదాకా
జీవం ..లో ఒదగవే ఒంటరిగా
లో..లో ముగిసే మౌనంగా
ఓ ఓ ఓఓఓ...ఓ ఓ ఓఓఓ...

హృదయం ఓర్చుకోలేనిదీ..గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

ఊహల లోకంలో ఎగరకు అన్నావే..
తేలని మైకంలో పడకని ఆపావే..
ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా..
మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
తెలవారి తొలి కాంతి నీవో
బలికోరు పంతానివో
అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ ఓ ఓ

హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
చల్లని చూపులతో దీవెనలిస్తాడు
అంతటి దూరం ఉండే బ్రతికించే వరమౌతాడు
చెంతకి చేరాడంటే చితిమంటే అవుతాడు
హలాహలం నాకు సొంతం
నువు తీసుకో అమృతం
అనుకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ ఓ ఓ

హృదయం ఓర్చుకోలేనిదీ గాయం
ఇకపై తలచుకోరానిదీ ఈ నిజం

వయస్సునామి


వయస్సునామి
చిత్రం: కంత్రి (2008)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: వేటూరి
గానం: హేమచంద్ర, సునీత

వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమీ
సొగస్సుతోమి ధూముదామి ఆడు తకతైధిమి
ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ
చెక్కిలి చిక్కిన చెక్కరలోయీ
పిల్లో పడిపోయా మాయల లోయలో
పిల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ

చరణం 1:

ఎరక్కపోయి యమయమా ఇరుక్కుపోయా ప్రియతమా
తళుక్కుమన్న తమకమా చిటుక్కుమన్న చిమ చిమ
లేడి వేటకు వేడిగ వచ్చే వేటగాడివి నీవా
వేటకోసం వాడిగ చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చాక మదనా నేనోపగలనా నిన్నాపగలనా

చర్వణం 2:

కొరుక్కుతిందా నేత్రమా చురుక్కు చూపే చైత్రమా
అతుక్కుపోయే ఆత్రమా జతక్కులాసా గ్రోతమా
హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవె భామా
ఒద్దుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిన్ను మెచ్చానె లలనా ఓ ఇందువదనా నీకింతపదునా

వయస్సునామి తాకెనమ్మి ఆగలేను సుమీ
సొగస్సుతోమి ధూముదామి ఆడు తకతైధిమి
ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయి ఓ
ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి
ఎక్కిడితొక్కిడి దక్కుడు హాయి ఓ
చెక్కిలి చిక్కిన చెక్కరలోయీ
పిల్లో పడిపోయా మాయల లోయలో
పిల్లో దిగిపోయా ఊయల లోతులో ఓ ఓ