Showing posts with label రాహుల్ శిప్లిగంజ్. Show all posts
Showing posts with label రాహుల్ శిప్లిగంజ్. Show all posts

చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
చిత్రం : గ్యాంగ్ (2018)
సంగీతం : అనిరుద్
సాహిత్యం : కృష్ణ కాంత్
గానం : రాహుల్ శిప్లిగంజ్

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

అరె రండయ్య రండయ్య
లేటింక వద్దయ్య
ఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్య
చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

అరె రండయ్య రండయ్య
లేటింక వద్దయ్య
ఎక్కడున్నారయ్యా ఎప్పుడొస్తారయ్య
చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా

ఎగిరి ఎగిరి పైకి ఎగర
తిరిగి తిరిగి మనము నవ్వగ
చిందాడి చిందాడి ఆడాలి నువ్వింక
కలిసి కలిసి దూకాలిరా ఇంక
తగ్గద్దు తగ్గద్దు మాట పదును
ఎగసె ఎగసె పైకి కదులు
ఎరుపు ఎరుపు కొపమవ్వర
ఎంత పడితె అంత లెగర

చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా

వెళ్ళొద్దు అంటూనె ఆపేటివాళ్ళె ఉంటే
తరిమి చూడరా
తలపొగరుతొ ఎగిరె వాడిని
తరిమి కొట్టరా
ఆకలి అన్న వాడి ముద్ద లాగుతుంటె
ఎదురు తిరగరా
నిన్ను తగలక భయపడేల
తెగువ చూపరా
కడుతు గొడవబడిన
తిరిగి తిరగపడరా
పలుగు ఎదురుపడితె
నలిపి గెలవరా
ఎవడు తగువు పడిన
ఎవడి మాట వినక
తరిమి తరిమి కొడితె
తలుపు విరగదా

అరె పోవయ్య పోవయ్య
ఏ చోట పోవయ్య
కంట పడ్డారంటే తంటాలు మీకయ్య
అకడ ఇకడ ఎకడొ పోవయ్య
ఇటు పక్కకి వచ్చారో ఇంజరీ అవునయ్య

చిటికె మీద ఓ.. చిటికె మీద..
తమ్ముడూ...
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు నడి రోడ్డులోనా
చిటికె మీద చిటికె వేసెరా
నా వేలు చూడు
నడి రోడ్డులోన
చిటికె మీద చిటికె వేసెరా

విరిచి విరిచి ఇరగ తోముతాం
ఇంక విరిచి విరిచి ఇరగ తోముతాం
అధికారం అణిచి దించేసి పొగరు
తొక్కిపెట్టి నరము లాగుతాం

ఎయ్ ఎత్తుకు పోవ్వలి పళ్ళు ఊడకొట్టాలి
వీధి వీధి తిప్పి చెప్పులతొ కొట్టాలి
కాదంటు అంటేనే ఎత్తెత్తి ఎత్తెత్తి తన్నాలి
బీద వాళ్ళ బాధ వాడింక చూడాలి
విరిచి విరిచి ఓ.. విరిచి
ఇంక విరిచి విరిచి ఇరగ తోముతా
అధికారం అణిచి దించేసి పొగరు
తొక్కిపెట్టి నరము లాగుతా
చిటికె మీద చిటికె వేసెరా..

పాల పిట్టలో వలపు


పాల పిట్టలో వలపు
చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : రాహుల్ సిప్లిగంజ్, మానసి

ఏవో గుస గుసలే
నాలో వలసే విడిసీ
వలపే  విరిసే  ఎదలో

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల బుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే
పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

కొండవలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే
గడపకద్దినా పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి
నా మానసిట్టా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడ గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుతుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన తేనె పట్టులా
నిద్ర పట్టదే రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ
మనసు దానినల్లే తూనీగ
మెల్ల మెల్లగా చల్లినావుగా
కొత్త కలలు బాగా

పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల పుట్టలో మెరుపు
నీ కట్టు బొట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే

పిల్లోడా గుండెలోన
ఇల్లే కట్టేసినావె
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

పిలగా నువ్ ఇరగ ఇరగ


పిలగా నువ్ ఇరగ ఇరగ
నా పేరు సూర్య (2018)
సంగీతం: విశాల్ శేఖర్
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: మోహన భోగరాజు, రాహుల్ సిప్లిగంజ్

ఇస్టైలు పిల్లగాడు నన్నత్తిరిబిత్తిరి సేసిండే
ఈటెల్లాంటి సూపుల్తో ఇస్తిరి సేసిండే
ఇరగ దీసిండే...ఏ....
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ

పిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట
పిందె పెదవేమో పూతరేకుల తట్ట 
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ

అట్ట నిను చూసి నాలో ఆకలి పుట్ట
ఫ్రంటు ఫుట్టేసి నిన్నే పిడికిట పట్ట
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ

ఎట్టుకొచ్చానే తిరణాల కళ్ళజోడు
కలర్ ఫుల్లుందే కిర్రాకు నీ ఈడు 
చల్లుకుంటానే మల్లెపూలు లారీ లోడు 
కట్టుకుంటానే నీ మెళ్ళో నాన్ తాడు 
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ

పిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట
పిందె పెదవేమో పూతరేకుల తట్ట
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
అట్టా నిను చూసి నాలో ఆకలి పుట్ట
ఫ్రంటు ఫుట్టేసి నిన్నే పిడికిట పట్ట
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ

హెయ్! డివ్వీ డివ్వీ డివ్విట్టం
నీ చూడీదారే నా చుట్టం
చున్నీ నీకు వరకట్నం
ఏం సేసేత్తావో నీ ఇష్టం
రాయే నా రాణి పులస
నేనే నీ మట్టగిడస
గుచ్చావె పూల పరిశ
కలిపావె వావి వరస
కుదమట్టం సోకుల్తొ
గరగాట్టం రేపావె
వొడిగట్టు వడ్డాణం ఇరగ 
ఇరగ ఇరగ…
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ

నువ్వె జ్యూసీ చాక్లెట్ ఆ
నేనే స్పైసీ ఆమ్లెట్ ఆ
మన జోడీ బొంబాట్ ఆ
ఏస్కొ కిక్ యాస్
ఫుల్ మాస్ మాన్ స్టర్ బీట్
కిక్ యాస్ ఫుల్ మాస్ మాన్ స్టర్ బీట్
పిలగా నువ్ ఇరగ ఇరగ
మాన్ స్టర్ బీట్
పిలగా నువ్ ఇరగ ఇరగ
మాన్ స్టర్ బీట్
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్ ఇరగ ఇరగ ఇరగ ఇరగ
పిలగా నువ్విరగిరగ...

రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

రాయ రాయె రాయ రాయె మైసమ్మ,
ఇస్మార్ట్ శంకర్ (2019)
మణిశర్మ
కాసర్ల శ్యామ్
రాహుల్ సిప్లిగంజ్, మోహన

నీ ముక్కుపోగు మెరుపులోన..
పొద్దుపొడిసె తూరుపులోన మైసమ్మా
ఎర్రా ఎర్రని సూరీడే..
నీ నుదుటున బొట్టయ్యే
ఓ సల్లనిసూపుల తల్లి మాయమ్మా

అమ్మలగన్న అమ్మరన్నా..
పచ్చి పసుపు బొమ్మరన్నా
యాపచెట్టు కొమ్మరన్నా..
ధూపమేసే దుమ్మురన్నా
ఆషాఢ మాసమన్నా..
అందులో ఆదివారమన్నా
కొత్త కుండల బోనమన్నా..
నెత్తికెత్తెను పట్నమన్నా
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

హే రాయ రాయె రాయ రాయె మైసమ్మ,
బల్కంపేటెల్లమ్మవే,
మా తల్లి బంగారు మైసమ్మవే
ఉజ్జయినీ మాంకాళివే..
మాయమ్మ ఊరూరా పోచమ్మవే
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

రేవుల పుట్టింది.. రేణుక ఎల్లమ్మ
జెర్రిపోతుల తీసి జడల చుట్టింది
నాగుపాముల తీసి నడుముల కట్టింది
ఏడుగురు అక్కచెల్లెళ్లు ఎంటరాంగ
ఏడేడు లోకాలు ఏలుతున్నదమ్మ
మావురాల ఎల్లమ్మ దండాలు తల్లీ

దిస్ ఈజ్..బర్కత్ పుర
డీజే ఇస్మార్ట్..డిస్కో బోనాల్

పెయ్యి నిండ గవ్వల్ని పేసుకున్నవే
వెయ్యికళ్ళా తల్లీ నీకు యాటపోతులే
నిమ్మకాయ దండల్లో నిండుగున్నవే
కల్లూ కుండ తెచ్చి ఇక సాక పోస్తమే

అరె..
చింతా పూల చీరకట్టినవే
చేత శూలం, కత్తి పట్టినవే
మొత్తం దునియానే ఏలుతన్నావే
రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

జూబ్లీహిల్సు పెద్దమ్మవే..
మాయమ్మ జగమేలే మా తల్లివే
గోల్కొండ ఎల్లమ్మవే..
మాయమ్మ లష్కరుకే నువ్ రాణివే
హోసే... హోసే.. పోతరాజురో..
జజ్జనకర జజ్జనకర తీనుమారురో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండిమైసమ్మరో

ఏస్కో మామా తీన్మార్...

అగ్గి గుండాలల్లో నువ్వు భగ్గుమన్నవే
సుట్టూ ముట్టు సుక్కల్లొ ముద్దుగున్నవే
పుట్టలోనా ఉన్నట్టి మట్టిరూపమే..
బాయిలోన పుట్టి అల్లినావు బంధమే
గాలీ దూళీ.. అంతా నువ్వేలే
జాలీ గల్లా తల్లీ నువ్వేలే
ఈ జనమంతా నీ బిడ్డలే
రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

బెజవాడ దుర్గమ్మవే..
మాతల్లి కలకత్తా మాంకాళివే
కంచిలోన కామాక్షివే..
మాయమ్మ మధురలోన మీనాక్షివే
యోసే.. యోసే..అరే ఈల గోలరో..
తొట్టేళ్లతో పొట్టేళ్ల బండి కదిలెరో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో
దిస్ ఈజ్ హమారా కిర్రాక్
బోనాల్ బోనాల్

బొంబాటు



బొంబాటు
లై (2018)
మణిశర్మ
కాసర్ల శ్యామ్
రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా

అదర నా గుండెలదర నిదుర కంటికి రా...దూ...
మదుర వెన్నెల గాసెను కదరా..
ఈ సిన్నదొస్తె పగలు వెన్నెల గాసెను గదరా...
బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిర నారి
లడ్డోలె ఉన్నదిర గోరి
లై లైలప్ప బుగ్గల్ది ప్యారి
బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిర నారి
లడ్డోలె ఉన్నదిర గోరి
లై లైలప్ప బుగ్గల్ది ప్యారి
ఏడికెల్లి ఊడిబడ్డదీ మిస్సు
దీని నవ్వుతోనె ఎలిగిపోయె యుఎస్సు
నడుమును జూత్తే అరెరెరె….
నడుమును జూత్తె నయగర ఫాల్స్
నేను బోత పయలెల్లిపోత
ఒక్కసారి ముట్టుకోని సచ్చిపోత
సచ్చిపోత
నేను బోత పయలెల్లిపోత
బాంచన్ నీ కాల్లు మొక్కి సచ్చిపోత
సచ్చిపోత
ట్రంపెట్ అల్లె ఒంపులున్న పోరి
ట్రంప్ లెక్క సంపుతుందిరొ నారి
ర్యాంపు వాక్ చెసుకుంటు గోరి
స్టాంపు గుద్దినాది గుండె మీద ప్యారి

అందగత్తె ఎవ్వరంటె వయ్యారి పిల్ల
నీ ఒక్కపేరె కనపడ్డదె గూగుల్లా
నువ్వు ఆగి ఒల్లు ఇరుసుకుంటె వయ్యారి పిల్ల
నాకు బొక్కలిరిగినట్టుందె రెండు పక్కల
నువ్వు లిప్పునట్ల గొరుకుతుంటె వయ్యారి పిల్ల
నిప్పు ఎల్ట పుట్టె తెలిసినాది నాకియ్యాల
నీ తోవకడ్డమొస్త నేను వయ్యారి పిల్ల
నన్ను పండబెట్టి తొక్కిపోవె చౌరస్తాల
సుక్కలెక్క సక్కగుంది పోరి
దీని సెమట సుక్క సెంటు నాకు వారి
అర్రె..
నన్ను గాని ఒప్పుకుంటె గోరి
నా స్కిన్ను ఒలిచి గుట్టిస్త సారీ
బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిర నారి

నీ కొంటె సూపు తాకితెనె వయ్యారి పిల్ల
మునిగి తేలినట్టు ఉంటదె కాసి గంగల
నీ ఒంటి గాలి సోకితేనె వయ్యారి పిల్ల
సచ్చిపోయి నేను పుడతనె మల్లా మల్లా
గ్రీన్ సిగ్నల్ ఇయ్యరాదె వయ్యారి పిల్ల
గ్రీన్ కార్డు  తెచ్చుకుంటనె తెల్లారికల్ల
ఓ మంచిరోజు చూసి రావె వయ్యారి పిల్ల
ఫ్రెంచ్ వైన్ లెక్క దాచుకుంటనే గుండెల్ల
వైటు హౌసు వన్నెలున్న పోరి
లైట్ హౌసు లెక్క సూపరాదె దారి
అరెరెరె…
రైట్ హాండ్ పట్టుకుంటె గోరి
నీకు డిస్ని లాండు రాసిస్త ప్యారి
బొమ్మోలె ఉన్నదిర పోరి
బం బంబాటు గుందిర నారి