ఆలయమేలా...
సతీ అనసూయ (1971)
రాజశ్రీ,
సుశీల,
ఆదినారాయణరావు
ఆలయమేలా? అర్చనలేలా? ఆరాధనలేలా?
పతిదేవుని పదసన్నిధి మించినది వేరేకలదా
అదే సతి పెన్నిధి కాదా! అదే పరమార్థము కాదా
ఏ కొండ కొమ్ముపైనో ఏ రాతి బొమ్మలోనో
దైవమ్ము దాగెనంటూ తపియించ నేలా
ఆ దైవము నిజముగ ఉంటే - అడుగడుగున తానై ఉంటే
గుడులేల? యాత్రలేలా?