ఇప్పటికిప్పుడు రెప్పల్లో
ప్రేమకు వేళాయెరా(1999)
చిత్ర, ఉన్ని కృష్ణన్,
ఎస్.వి. కృష్ణారెడ్డి
ఇప్పటికిప్పుడు రెప్పల్లో ఎన్నెన్ని కలల ఉప్పెనలో
ఉక్కిరి బిక్కిరి ఊహల్లో ఎన్నెన్ని కలల ఊవిళ్లో
మనసుని మేలుకొమ్మని కదిపి కుదిపే
సరదాల సందడి
ప్రేమకి వేళయిందని తరిమి తడిమే
తరుణాల తాకిడి
ఏం చేయమంది కొంటె అల్లరి
ఆ మాట చెప్పదు ఎలా మరి
మాటలేవి వద్దు చేరుకోమని
చిలికి చినికి ఉలికి పడే
చిలిపి వలపు చినుకు సడి