మువ్వలా నవ్వకలా
పౌర్ణమి (2006)
సిరివెన్నెల
దేవిశ్రీ ప్రసాద్
బాలు, చిత్ర
మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
మువ్వలా నవ్వకలా... ముద్దమందారమా
ముగ్గులో దించకిలా... ముగ్ధ సింగారమా
నేలకే నాట్యం నేర్పావే... నయగారమా
గాలికే సంకెళ్ళేశావే... ఏ...ఏ...
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా...
ఇది నీ మాయ"వల" కాదని అనకుమా...
ఆశకే ఆయువు పోశావే... మధుమంత్రమా...
రేయికే రంగులు పూశావే...ఏ..ఏ..