February 8, 2020

నీ కనుదోయిని


నీ కనుదోయిని నిద్దురనై
చిత్రం : గుడిగంటలు (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : నార్ల చిరంజీవి
నేపధ్య గానం : జానకి

పల్లవి :

నీ కనుదోయిని నిద్దురనై...
నీ కనుదోయిని నిద్దురనై...
మనసున పూచే శాంతినై..
నీ కనుదోయిని నిద్దురనై...
మనసున పూచే శాంతినైఎడబాయని నీడగ తోడవుతా...
నీ కలలకు నేనే జోడవుతా ...
నీ కనుదోయిని నిద్దురనై...
మనసున పూచే శాంతినై

చరణం 1 :

నీ కలలన్నీ నావోయీ... 
నా యవ్వనరాగం నీదోయి
వలపుల గుడిలో గంటలు మ్రోగే
జంటగ రమ్మని పిలిచాయి...
ఇరువురినీ... పిలిచాయి

నీ కనుదోయిని నిద్దురనై...
మనసున పూచే శాంతినై

చరణం 2 :

కాటుక కళ్ళే కానుకగా... 
నా బుగ్గల సిగ్గే హారతిగా
హృదయము నీకె అంకితమొసగే
నీ బిగికౌగిలి చేరెదను...
ఒరిగెదను...కరిగెదను...ఊ

నీ కనుదోయిని నిధ్ధురనై... 
మనసున పూచే శాంతినై
ఎడబాయని నీడగ తోడవుతా... 
నీ కలలకు నేనే జోడవుతా
ఆహాహాహాహ..
ఆ... ఆహాహహా ....