నాగిని చిత్రంలోని -'తన్ డోలే మేరా మన్ డోలే’ ట్యూన్ ఆధారంగా రూపొందిన యుగళ గీతం.
ఎన్టీఆర్, జమునలపై ఆహ్లాదకర చిత్రీకరణ -మనసూగే సఖ తనువూగే ప్రియా మదిలో.
మనసూగే సఖ తనువూగే
చిత్రం: భాగ్యరేఖ (1957)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: దేవులపల్లి కృష్ణశాస్త్రి
నేపధ్య గానం: ఏ.ఎమ్.రాజా, పి. సుశీల
మనసూగే సఖ తనువూగే ప్రియ
మదిలో సుఖాల డోలలూగే
ఏ మధువా నేనోయి ప్రియా
వయసూగే చెలి సొగసూగే
ప్రియ వగలాడి ఓర చూపులూగే
ఏ మధువా నేనో సఖియా
మలుపు మలుపు కడ నిలిచీ
చెవిలో మంతనాలు ఊదాలి.
కలసి మెలసి కలకాలమిలాగే
మధురయాత్ర సాగాలి
ఇలాగే మధురయాత్ర సాగాలి
మనసూగే సఖ తనువూగే ప్రియ
మదిలో సుఖాల డోలలూగే
ఏ మధువా నేనోయి ప్రియా
అలలూగే మది కలలూగే ప్రియ
తెలివాక పూల నౌక ఊగే
ఏ వలపూపేనోయి ప్రియా
రేవు రేవు కడ కనులు కనులతో
మూగబాస లాడాలి
పైరగాలి పన్నీటి ఏటిపై
పడవ సాగిపోవాలి
ఇలాగే పడవ సాగిపోవాలి
మనసూగే సఖ తనువూగే ప్రియ
మదిలో సుఖాల డోలలూగే
ఏ మధువా నేనోయి ప్రియా