చిత్రం: మెరుపుకలలు (1997)
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం: వేటూరి
గానం: వాసుదేవన్, సుజాత
పల్లవి :
ఓ వాన పడితే ఆ కొండాకోన హాయి
పూలొచ్చీ పలికే సంపంగి భావాలోయి
ఓ వాన పడితే ఆ కొండాకోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
ఓ వాన పడితే ఆ కొండాకోన హాయి
పూలొచ్చి పలికే సంపంగి భావాలోయి
కోయిలకే కుక్కూక్కు
ఎదహోరే కాంభోజి
సంగీతమంటేనే హాయి హాయి
నదిలోన లెహరి లాలి
పసిమువ్వల్లో సన్నాయి
గీతాలు వింటుంటేనే పుట్టే హాయి
జగమంతా సాగే గీతాలే పడుచు ఖవ్వాలి
సాగింది నాలో
స స రి గ మ ప ద ని స రీ...
ఓ వాన పడితే...
చరణం 1:
రాతిరొచ్చిందో రాగాలె తెచ్చిందో
టిక్ టిక్ అంటాది గోడల్లో
దూర పయనంలో
రైలు పరుగుల్లో
చుక్ చుక్ గీతాలే ఛలో
సంగీతిక ఈ సంగీతిక
సంగీతిక ఈ సంగీతిక
మధుర సంగీతసుధా
పాపల్ని తానే పెంచి
పాడే తల్లి లాలే హాయి
మమతరాగాలు కదా
ఓ వాన పడితే
చరణం 2:
నీలారం అడుగుల్లో
అల్లార్చే రెక్కల్లో
ఫట్ ఫట్ సంగీతాలే వినూ
గోవుల్ల చిందులలో
కొలువున్న మాలచ్చి
ఎట్టా పాడిందో వినూ
సంగీతిక ఈ సంగీతిక
సంగీతిక ఈ సంగీతిక
జీవన సంగీతసుధా
వర్షించే వానజల్లు
వర్ణాలన్నీ గానాలేలే
ధరణి చిటికేసే విను
ఓ వాన పడితే...