December 30, 2019

మా పెరటి జాంచెట్టు


మా పెరటి జాంచెట్టు
పెళ్ళిసందడి (1995)
కీరవాణి
వేటూరి
చిత్ర, బాలు, కోరస్

కాబోయే శ్రీవారికి....
ప్రేమతో వ్రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ....

మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే....
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే....
నిను చూసినాక నిదరైన రాక
మనసే పెళ్ళిమంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగా కరిగేది ఏనాడని.. అంటూ..
మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే..
(యెస్ ... యు ఆర్ మై డ్రీమ్ గర్ల్.... నా కలలరాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం...! అవును అద్భుతం. మన కలయిక అద్భుతం....! ఈ కలయిక ఇలాగే ఉండాలి... యెస్....యెస్  . )

నిన్ను చూడందే పదేపదే పడే యాతన
తోటపూలన్నీ కనీవినీ పడేను వేదన
నువ్వు రాకుంటే మహాశయా...
మదే ఆగునా...
పూలతీగల్తో పడే ఉరే నాకింక దీవెనా
చూసే కన్నుల ఆరాటం
వ్రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి
నీ రాక కోసం
వేచి ఉన్న ఈ మనసుని అలుసుగ చూడకనీ..
అంటూ..
మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే

పెళ్ళి చూపుల్లో నిలేసినా...
కథేంటో మరి
జ్ఞాపకాలల్లో చల్లేసిన
జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లా ప్రతీక్షణం
యుగాలయ్యినా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదనీ
తప్పులు వ్రాస్తే మన్నించు
తప్పక దర్శనమిప్పించు
ఎదటో నుదుటో ఎచటో మజిలీ
నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయచేయమని..
అంటూ..
మా పెరటి జాంచెట్టు పళ్ళన్ని కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీకోసం ఎదురే చూసే