రాధా మానస రాగ సుగంధ



రాధా మానస రాగ సుగంధ
ఆ ఒక్కడు (2009)
మణిశర్మ
డాక్టర్ నారాయణ

రాధా మానస రాగ సుగంధ కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళి రసకందా
రారా గోకుల నంద ముకుంద రారా కరివరదా

రాధా మానస రాగ సుగంధ కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా

మంచిని పెంచే మధుమయ హృదయా
వంచన తుంచే వరగున వలయా
మమతను పంచే సమత నిలయా
భక్తిని ఎంచే బహుజన విజయా
మాయా ప్రభవా మాధవ దేవా
మహిమా విభవా మధుభావా
శ్రీ కృష్ణ మా తృష్ణ నీ పైనా
రాధా మానస రాగ సుగంధ కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా

ధర్మము తరిగి నలిగిన వేళ
చరలో చేరిన ఓ యదు వీరా
కలగా సాగే కరుణాధారా
పరమై వెలిగే వర మందారా
పదములు చూపే పరమొద్ధారా
భారము నీదే భాగ్యకరా
శ్రీ కృష్ణ మా తృష్ణ నీ పైనా

రాధా మానస రాగ సుగంధ కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా
శ్రీ బృందావన మోహన మురళీ రవళి రసకందా
రారా గోకుల నంద ముకుంద రారా కరివరదా

రాధా మానస రాగ సుగంధ కృష్ణా గోవిందా
గోపి యవ్వన పుష్ప మిళింద లీలా మకరందా