మంగళంపల్లి బాలమురళి గారు పాడిన తత్వాలు
-----వైరాగ్య తత్త్వం
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
చేసిన ధర్మము, చెడని పదార్ధము చేరునే మీవెంట.
(పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా)
చేతిలో అమృతము ఉన్నంతసేపే అన్నదమ్ములంటా
ఆగాధంబై పోయేనాడు ఎవరు రారు వెంటా
(చేతిలో బెల్లం ఉన్నవరకే చీమ బలగమంట
చేతిలో బెల్లం చెల్లితే ఎవరు రారు వెంట)
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనట
అంతమువరకు కించిత్ ఆశతో పెంచెను జగమంతా
(మట్టికుండ ఇది నమ్మరాదు మర్మమెరుగమంట)
(పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా
ప్రమిదలో నూనె ఉన్నవరకే దీపమెలుగునంట
ప్రమిదలో నూనె నిండగా దీపమారునంట
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా)