December 30, 2019

సై సై సయ్యారే


సై సై సయ్యారే
ఘరానా బుల్లోడు (1997)
కీరవాణి
వేటూరి
బాలు, చిత్ర

పల్లవి:

సై సై సయ్యారే సై సై సయ్యారే 

పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా

సై సై సయ్యారే సై సై సయ్యారే

మక్కువైన మల్లెచెండు ఇస్తవా ఇస్తవా

సై సై సయ్యారే సై సై సయ్యారే

కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది

కడవా కవ్వమంటే కలయిక మనది

దీని తస్సదియ్య దాని ఊపు చూసి
నేను కాపు కాసి కొత్త కాపు కోసి
కొంగు చాటునున్న పొంగులన్ని చూస్తే
దాని తళుకు బెళుకు తొణికినపుడే

సై సై సయ్యారే సై సై సయ్యారె

సయ్యారే సయ్యరె సయ్యరె సయ్యరె సయ్యరె సై

పిక్కపైకి చీరకట్టి వస్తవా వస్తవా

సై సై సయ్యారే సై సై సయ్యారే

మక్కువైన మల్లిచండు ఇస్తవా ఇస్తవా

సై సై సయ్యారే సై సై సయ్యారే ......

చరణం 1: 

కడవతో కదిలొస్తుంటే...
కలా ఇలా శకుంతులై మెరిసింది

చిలిపిగా వెనకొస్తుంటే
జడా దడ జతిస్వరం పలికింది

అగ్గేసి పోయే ఆరాటంలో
మొగ్గేసి పోయే మోమాటంలో

వగలో వయ్యారమొ అదిరిందిలే
లయలో లడాయిలో తెలిసిందిలే

చరణం 2: 

వలపుతో వలవేస్తుంటే
అదెక్కడో చలాకిగ తగిలింది

పొలములో నాటేస్తుంటే
మనస్సులో ధనస్సులా విరిగింది

సంపంగి పూల సాయంత్రంలో
చింపంగి రేకు సీమంతంలో

ఓయ్... పగలు పరాకులు  పరువానికే
మధురం మనోహరం మనపేరులే
సయ్యారే.....