అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
శుభలగ్నం (1994)
ఎస్వీ కృష్ణారెడ్డి
జొన్నవిత్తుల
బాలు, చిత్ర
అల్లుకుపోవే ఒసే మల్లెతీగ
హత్తుకుపోవే జరీ మెరుపుతీగ
అందుకనె ఉన్నా ఒంటరిగా
తొందరగా రావే తుంటరిగా
కౌగిలి నీదే ఒరే కందిరీగ
సొయగమే చేసా కానుకగా
చరణం: 1
మొక్కజొన్న చేనులో మంచెకాడ
మొక్కుతాను పొందుకై అందగాడ
చిలకనవ్వు కులుకులాడి చిలిపిచూపు తగిలితే
తమలపాకు తోపుకాడ పడుచువాస తకిటథోం
తియ్యాతియ్యని వలపు తిరిగిందే ఒక మలుపు
తియ్యాతియ్యని వలపు తిరిగిందే ఒక మలుపు
మనసు మనసు కలిసె కలిగింది మైమరపు
మనసు మనసు కలిసె కలిగింది మైమరపు
ఈ అవకాశం కోసమే వేచిఉంది పానుపు ||అల్లుకు||
చరణం: 2
తాళలేదు వాలికే పూలతీగ
తెప్పరిల్లనీయరా తేనెటీగ
వెన్నెపూస మనసుకోరి వేడివయసు చిలుకుతా
అలకతీర్చి ఒడికి చెర్చు పులకరించి దొరుకుతా
కలికీ వెన్నెల శిల్పం కౌగిలిలో చెరాలి
కలికీ వెన్నెల శిల్పం కౌగిలిలో చెరాలి
ఎదలో మమతా దీపం బతుకంతా వెలగాలి
ఎదలో మమతా దీపం బతుకంతా వెలగాలి
ఆ వెలుగులో వెలగాలి ఏడేడు జన్మలు ||అల్లుకు||