సొగసు చూడ తరమా
సైనికుడు (2006)
వేటూరి
హ్యారిస్ జయరాజ్
శ్రేయాగోషాల్
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
హా.. సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
ఓ చల్లగాలీ ఆ నింగీ దాటి ఈ పిల్లగాలి వైపు రావా
ఊహల్లో తేలీ నీ వళ్ళో వాలీ నాప్రేమ ఊసులాడనీవా
పాలనురుగులపైన పరుగులు తీసి పాలు పంచుకోవా
పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమగాధ వినవా
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడూ గట్టిమేళా
బుగ్గే కందేలా సిగ్గే పడేలా నాకొచ్చెనమ్మా పెళ్ళి కళా
మబ్బు పరుపుల మాటు మెరుపుల మేన పంపెనమ్మ వానా
నన్ను వలచినవాడు వరుడై రాగా ఆదమరచిపోనా
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా
మనసునాప తరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా
నా కళ్ళల్లో.. వాకిళ్ళల్లొ ఉయ్యాలలూగె ప్రేమా హో
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సిందూలేసే సూడవమ్మ వయసునాప తరమా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నాలో నేను లేనోయమ్మ ప్రేమ వింత వరమా
ప్రేమ వింత వరమా ప్రేమ వింత వరమా