December 31, 2019

పాటలలోనా జీవితమే పలికించేనంటా


పాటలలోనా జీవితమే
నవవసంతం (1990)
ఎస్.ఏ. రాజ్ కుమార్
బాలు

పాటలలోనా జీవితమే పలికించేనంటా
మాటలలో చందనమే వెదజల్లేనంట

ఉదయం పలికించాలి నాదం నాదం
గాలీ ఇక వేయాలి తాళం తాళం
అడవుల్లో కోయిల నాకే అందిస్తుంది రాగం
త్వరలోనే కలిసొస్తుంది వేదిక ఎక్కే యోగం

ఏ దేశ జనులయినా నా పాటలకే తలలూపేరు
పాటలలో ఆకలి దప్పిక
మేమే మరచిపోయేము

జీవితమే గానంలో కలిపి సాగనీ...

పలికే వేయి ఆశలనే మదిలో గీతం
పూచే మల్లె పువ్వులలో విరిసే గంధం

తొందరలో లోకానికి నా పాటే కాదా వేదం
అందరినీ ఆశలలోనా
కదిలించే నా గానం

గానానికి నింగి నేల చేతులు కట్టి నిలిచేను
గీతానికి దశదిశలన్నీ హారతులే అందించేను.
పాడేటి పాటేగా మాకు ప్రాణమూ