December 30, 2019

రేపల్లె మళ్ళీ మురళి విన్నది



మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
చిత్రం: అల్లరి మొగుడు (1990)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: బాలు, చిత్ర

పల్లవి :

తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం
ఆ పల్లె కళే పలుకుతున్నది... తననం
ఆ జానపదం ఘల్లు మన్నది .. తననం
ఆ జాణ జతై అల్లుకున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక .. తననం

రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం
ఆ పల్లె కళే పలుకుతున్నది...
చరణం 1 :

తాననతందానన.. తజుమ్ తజుమ్ తజుమ్ తజుమ్
తాననతందానన.. తజుమ్ తజుమ్.. తజుమ్ తజుమ్

ఆ పెంకితనాల పచ్చిగాలి ఇదేనా..
పొద్దుపోని ఆ ఈల.. ఈ గాలి ఆలాపన

ఆ కరుకుతనాల కన్నె మబ్బు ఇదేనా..
ఇంతలో చిన్నారి చినుకై చెలిమే చిలికేనా
అల్లరులన్ని పిల్లనగ్రోవికి స్వరములిచ్చేనా
కళ్ళెర్ర జేసి కిన్నెరసానికి సరళి నచ్చేనా

మెత్తదనం... తందానన... మెచ్చుకుని ...
గోపాలకృష్ణయ్య గారాలు చెల్లించనా

తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది... తననం
ఆ పల్లె కళే పలుకుతున్నది...
మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక

చరణం 2 :

నీ గుండె వినేలా వెంట వెంట ఉండేలా
గొంతులోని రాగాలు పంపాను ఈ గాలితో

ఆ ప్రేమ పదాల గాలిపాట స్వరాలు పోల్చుకుని
కలిపేస్తున్నాను నా శ్వాసలో

ఎక్కడున్నా ఇక్కడ చిన్న వెన్నె వెణువయ్యె
కొంగును లాగే కొంటేదనాలే కనులకు వేలుగయ్యే
వన్నెలలో తందనానా. .వెన్నెలలో
వెచ్చనయ్యే వెల్లువలయ్యె వరసే ఇది

తననం.. రేపల్లె మళ్ళీ మురళి విన్నది...
ఆ పల్లె కళే పలుకుతున్నది...
ఆ జానపదం ఘల్లు మన్నది ..
ఆ జాణ జతై అల్లుకున్నది...

మొగలిపువ్వు మారాజుకి మొదటి కానుక
ఎదను పరిచి వేసెయ్యనా ప్రణయ వేదిక
మల్లెపువ్వు మా రాణి ఈ గొల్ల గోపిక
మూగ మనసు వింటున్నది మురళిగీతిక ..