December 30, 2019

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ


శ్రీ వరలక్ష్మి హారతి
ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ
రాగం: మధ్యమావతి
తాళం: ఆది

పల్లవి: 

ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి

అను పల్లవి :

ఎట్లా నిన్నెత్తుకొందు
ఆట్లాడే బాలవునీవు
ఇట్లా రమ్మనుచు పిలిచి
కోట్లా ధనమిచ్చే తల్లి
||ఎట్లా నిన్నెత్తు||
చరణం 1:

పసిబాలవైతే ఎత్తుకొందు మహలక్ష్మి తల్లి
పసిడి బుగ్గల పాలవెల్లి
పూవులు పండ్లు తోరణములతో
పాలవెల్లి కట్టిన వేదికపై
కలహంస నడకలతోటి
ఘల్లుఘల్లుమని నడిచేతల్లి
||ఎట్లా నిన్నెత్తు||

చరణం 2:

వేయి నామాల కల్పవల్లి
వేమారు మాపై కరుణించి సాయమువుండుము
తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు
కరుణాకల్గి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యము
సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి
అష్టైశ్వర్యము అయిదవతనములిచ్చే తల్లి
||ఎట్లా నిన్నెత్తు||

చరణం 3:

నవరత్నాల నీ నగుమోమె తల్లి
వరలక్ష్మీ తల్లి కనకరాసుల కళ్యాణి
కుసుమ కోమల సౌందర్యరాశి లోకపావని
శ్రీ వరలక్ష్మీ శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ
శుక్రవారము జగతిలో వెలిగే తల్లి
|| ఎట్లా నిన్నెత్తు ||

చరణం 4:

కలలన్ని కన్నుల కరిగే వేళా
ఏ లోకాలో రమ్మని పిలిచే వేళ
తల్లివి నీవై పాపను నేనై నీ ఒడి లోనే నిద్దురపోనా
ఈ జన్మకు ఈ వరము చాలదా
|| ఎట్లా నిన్నెత్తు ||