December 31, 2019

ఘుల్‌ఘుల్‌ అను చిరుగజ్జెల


ఘుల్‌ఘుల్‌ అను చిరుగజ్జెల
శుభమస్తు (1995)
సామవేదం షణ్ముఖశర్మ
కోటి
బాలు, చిత్ర

పల్లవి

ఘుల్‌ఘుల్‌ అను చిరుగజ్జెల స్వరమా
ఎద స్వరమా
జల్‌జల్‌ అను జతగుండెల వరమా
కలవరమా
నాలో... ఏదో
నాదం మ్రోగే
చిగురాకుల శుభలేఖలు శుభమస్తని పలికెను కద
సుఖమా
సుఖమా
సుఖమా 
||నిసస||
చరణం 1

కవ్వించే కౌగిళ్ళలోగిళ్ళలో సుఖమా....సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
కైపెక్కే నీ కళ్ళవాకిళ్ళలో సుఖమా....సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
ఝుమ్మన్నది జివ్వన్నది నరం నరం సుఖస్వరం
రమ్మన్నది ఇమ్మన్నది రసాల సారం
అనుబంధాల అందాల గంధం పూసి
చనువియ్యాలి సరసానికి 
||ఘల్||

చరణం 2

చెక్కిళ్ళే చెమరించే సిగ్గావిరి సుఖమా....సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
చుక్కల్లో నడిపించే రసలాహిరి సుఖమా....సుఖమా
సుఖమా ఓ . . . సుఖమా
పింఛాలను విప్పిందిలె వయ్యారమే మయూరమై
పంచిందిలె సింగారపు పసందులన్నీ
నయగారాల గారాల అందాలన్నీ
ఇక నాసొంతం కావాలిలే 
||ఘల్‌||