మనవి సేయవే...
రేచుక్క-పగటిచుక్క (1959)
సముద్రాల రామనుజాచార్య (జూనియర్)
టి.వి.రాజు
ఘంటసాల
మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ
మనవి సేయవే మనసార చెలికి నాదు ప్రేమ
మనవి సేయవే
సందెవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో
సందెవేళ సుందరాంగి చిందువేయు వెన్నెలలో
సందు జేసుకొని నీవు చందమామ చల్లగా
(మనవి)
ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ మారుతమా
ఆమె కురులు కదిపి నీవు ఆడువేళ మారుతమా
చెలియ మనసు తీరు తెలిసి చెవిలోన మెల్లగా
(మనవి)