December 30, 2019

ఎంతసేపైన ఎదురుచూపేన



ఎంతసేపైన ఎదురుచూపేన
చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చిత్ర

పల్లవి:

ఎంతసేపైన ఎదురుచూపేన... నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో

ఎంతసేపైన ఎదురుచూపేన... నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో...

పాపర... పా... పా.....పాపర...పా ...పా.......
పాపర... పా... పా.....పాపర...పా ...పా.......
చరణం 1:

ఎన్ని కళ్ళో కమ్ముకుంటున్నా... ఆహా.. 
అతనినేగా నమ్ముకుంటున్నా
వెక్కిరించే వెయ్యిమందున్నా.. ఓహో... 
ఒక్కదాన్నే వేగిపోతున్నా...
ఎన్నాళ్ళు ఈ యాతనా... 
ఇట్టాగె ఎదురీదనా
ఎన్నాళ్ళు ఈ యాతనా... 
ఇట్టాగె ఎదురీదనా...
ఏలుకోడేవి నా రాజు చప్పునా ...హ ..హా...

ఎంతసేపైన ఎదురుచూపేన... నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
జు..జు...ఈ వేళ ఈ చోటనీ...రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో... ఏవిటో

చరణం 2:

హా...తోడులేని ఆడవాళ్ళంటే లా..ల.. 
కోడెగాళ్ళు చూడలేరంతే...
తోడేళ్ళై తరుముతూ ఉంటే ...
తప్పుకోను త్రోవలేకుందే లా.ల..ల
ఓ ఊరంత ఉబలాటమూ...
 నా వెంటనే ఉన్నదే
ఓ ఊరంత ఉబలాటమూ... 
నా వెంటనే ఉన్నదే
ఏవి లాభం గాలితో చెప్పుకుంటే...

ఎంతసేపైన ఎదురుచూపేన ...నా గతీ
ఎంతకీ రాడు ఏవిటోగాని సంగతి
లా..లా..ల ఈ వేళ ఈ చోటనీ ...రమ్మంది తానేననీ
ఈ వేళ ఈ చోటనీ... రమ్మంది తానేననీ
బొత్తిగా మరిచిపోయాడో ఏవిటో....