December 31, 2019

ఎవరైనా చూసారా...


ఎవరైనా చూసారా...
చిత్రం : ఇష్టం (2001)
సంగీతం : గోపీనాధ్
గానం : హరిహరన్, చిత్ర

ఎవరైనా చూశారా…..
ఎవరైనా చూశారా పరువే చెడదా పురుషోత్తమా
అరెరే అనరా ప్రియనేస్తమా ఎవరైనా చూశారా
గారంగా కొసరే వేళా కారంగా కసిరేవేలా?
గుండెల్లో జరిగే గోల మౌనంగా ఉంటే మేలా
అప్పుడప్పుడీ ఉపవాసం తమ అలవాటా...
కోరుకొంటే నా సహవాసం ఏం పొరపాటా...
ఓహో ఏమారోషం వామ్మో సమరావేశం కొరికేసే ఉక్రోషం
కరిగించే సరసం కోసం అడిగేస్తే ఏమిటి దోషం
ఇష్టమంత ఒగ్గబట్టి ఎందుకంత మొగమాటం

ఎవరైనా చూశారా పరువే చెడదా పరిహాసమా
చెబితే వినవా చెలగాటమా ఎవరైనా చూశారా

లేనిపోని సైగలు చేసి నను లాగాలా
చేరగానే వెనకడుగేసి వెటకారాలా
లోలో సరదా లేదా పైపై పరదాలేలా
తగువేలా నాతో తగువేళా బిగువేలా ఇంకా బిడియాలా
గుట్టే దాచాలన్నా దాగేనా

ఎవరైనా చూశారా పరువే చెడదా పురుషోత్తమా
అరెరె అనరా ప్రియనేస్తమా ఎవరైనా చూశారా
ఎరవేసే అల్లరి ఈలా పొరపాటే అయిపోవాలా
దరిదాటే వరదయ్యేలా పరుగెడితే పడవా బాలా
ఎవరైనా చూశారా పరువే చెడదా పరిహాసమా
చెబితే వినవా చెలగాటమా… ఎవరైనా చూశారా