మరెప్పుడొస్తారు తల్లా దవాఖానకు
సినిమా:- నేటి భారతం (1983)
సాహిత్యం:- కృష్ణస్వామి
సంగీతం:- చక్రవర్తి
గానం:- శైలజ, (వందేమాతరం) శ్రీనివాస్
దమ్ముతోటి దగ్గుతోటి సలిజొరమొచ్చిన అత్తో
అత్తో పోదాం రావే మన ఊరి దవఖానకు
దమ్ముతోటి దగ్గుతోటి చలిజొరమొచ్చిన అత్తో
దమ్ముతోటి దగ్గుతోటి చలిజొరమొచ్చిన అత్తో
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు
మందులు, గోలీలు, మంచి సూదులు ఇత్తన్రంట
మందులు, గోలీలు, మంచి సూదులు ఇత్తన్రంట
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు
అత్తో పోదాం రావే మన ఊరి దవాఖానకు
అమ్మ తల్లో..నేను రాను
నేను రాను బిడ్డో మన ఊరి దవాఖానకు
ఎర్రనీల మందు, సున్నాపు నీళ్ళ సూదులాయె
మందుకు దగ్గొచ్చె సూదేస్తే జొరమొచ్చే
నేను రాను బిడ్డో గండాల దవాఖానకు
నేను రాను బిడ్డో గండాల దవాఖానకు
ఔనమ్మా..ఒకసారీ
చీటీకి గట్ట బుట్టి
సీటీకి నేను బోతే
గరిజీల ఒత్తిడాయె
కడుపులో నొప్పి ఆయే
కాంపౌండర్ కాడికెళితే
కాలుకు పట్టి గట్టే
పన్నుకు బాధంటే తల్లో కన్నులే పీకేస్తారమ్మ
వద్దు వద్దు తల్లో యములున్న దవాఖానకు
వద్దు వద్దు తల్లో యములున్న దవాఖానకు
కొడలు పిల్ల నీల్లాడ ఆసుపత్రికని పోతే
అంబులెన్స్ కు పది ఆనే
వార్డు బాయ్ కి పదిహేను
ఆడపిల్ల పుడితే ఇరవై
మొగోడు పుడితే ముప్పై
మంచానికి ఏభైరో
మందులేవో ఉండవాయె
వద్దు వద్దు తల్లో లంచాల దవాఖానకు
వద్దు వద్దు తల్లో లంచాల దవాఖానకు
ఔనవును
ఆడు చీటి రాస్తే లంచం
ఈడు గేటు తీస్తే లంచం
ఆ సిస్టరమ్మకు లంచం
చిన డాక్టరయ్యకు లంచం
మంచాల ఉన్న మనోళ్ళ చూసొద్దమంటే లంచం
దొరలాసుపత్రి ఆయే..దరిలేని దోపిడాయే
వద్దు వద్దు తల్లో దగుల్భాజి దవాఖానకు
వద్దు వద్దు తల్లో దగుల్భాజి దవాఖానకు
కారెక్కివచ్చె దొరలను కనురెప్పలాగ చూస్తరు
అండ్లున్న మిషన్లన్ని అయ్యన్ని దొరల కోసమే
మంచి మంచి మందులన్ని ఆళ్ళకె ఇచ్చేస్తరమ్మ
వద్దు వద్దు తల్లో గొప్పోల్ల దవాఖానకు
వద్దు వద్దు తల్లో గొప్పోల్ల దవాఖానకు
ముత్యాలమ్మకు రోగమొచ్చి పక్షిలాగ ఆరుస్తుంటే
మందు లేదా దొర అంటే
మాపటికింటికి రమ్మనె
ధరగల మందులన్ని డాబుదొరల ఇండ్ల జేరె
బ్రతకలేని రోగమొస్తె పసరుమందు దిక్కాయే
వద్దు వద్దు తల్లో మాయదారి దవాఖానకు
వద్దు వద్దు తల్లో మాయదారి దవాఖానకు
నేను రాను బిడ్డో గండాల దవాఖానకు
నేను రాను బిడ్డో గండాల దవాఖానకు
మరెప్పుడొస్తారు తల్లా దవాఖానకు
ఉన్నోళ్ళదొక్క నీతి..లేనోళ్ళకొక్క జాతి
ఉన్నోళ్ళ, లేనోళ్ళ ఇడదీసి ఏలెటొల్ల
ఆళ్ళాళ్ళ దొరకబట్టి
ఆళ్లంతు మనంజూస్తే
ఏలుబడి మారునపుడు ..దవాఖాన మారునపుడు
అదిగో
అప్పుడొస్తమమ్మో మన ఊరి దవాఖానకు
మేమప్పుడొస్తమమ్మో మన ఊరి దవాఖానకు
అప్పుడొస్తమమ్మో మన ఊరి దవాఖానకు
మేమప్పుడొస్తమమ్మో మన ఊరి దవాఖానకు