December 31, 2019

తకదిమి తోం



హేయ్ తకదిమి తోం
చిత్రం : ఆర్య(2004),
రచన : సురేంద్రకృష్ణ
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్,
గానం : టిప్పు

పల్లవి :

హేయ్... తకదిమి తోం తకదిమి తోం
తరికిట తరికిట తకదిమి తోం
చిందులు వేసే వయసుకి తకదిమి తోం
తకదిమి తోం తకదిమి తోం
సరిగమ పదమని తకదిమి తోం
ఉరకలు వేసే మనసుకు తకదిమి తోం
కష్టం నష్టం ఎదురైన నచ్చినదె చేసేద్దాం
అలవాటైతే చేదైనా తకదిమి తోం
తప్పో ఒప్పో చేసేద్దాం
తొలి అడుగే వేసేద్దాం
అనుభవమైతే ఏదైనా తకదిమి తోం
కృషి ఉంటే నీ వెంటేరా ఈ లోకం
గాయేంగె జోష్ కేలియె
జీయేంగె ప్యార్ కేలియె॥తోం॥
చరణం : 1

చిరునవ్వుతో అటు చీకటిని
ఇటు ఓటమిని తరిమెయ్యరా
ఆ ఓర్పుకి తకదిమి తోం
ఉల్లాసమె ఓ వెల్లువల
ఓ ఉప్పెనలా ఉరకాలిరా
ఆ జోరుకి తకదిమి తోం
పరిగెడదాం పరిగెడదాం
గెలిచే వరకు పరిగెడదాం
గురి చూశాక మనకింక తిరుగేది
గాయేంగె జోష్ కేలియె॥తోం॥

చరణం : 2

నీ మాటతో అటు నిశ్శబ్దం
ఇటు ఓ యుద్ధం ఆగాలిరా
ఆ నేర్పుకి తకదిమి తోం
నా ప్రేమతో ఆ శత్రువునె
ఓ మిత్రునిగా మార్చాలిరా
ఆ గెలుపుకి తకదిమి తోం
ఒకటౌదాం ఒకటౌదాం
ప్రేమను పంచగ ఒకటౌదాం
ప్రేమించే మనసుంటే మహరాజే
జీయేంగె ప్యార్ కేలియె॥తోం॥