December 30, 2019

ఏడే ఏడేడే వయ్యారి వరుడు


వయ్యారి వరుడు
సఖి (2000)
ఏ ఆర్ రెహమాన్
వేటూరి
మహాలక్ష్మి అయ్యర్, వైశాలి, రిచా శర్మ

ఏడే ఏడేడే వయ్యారి వరుడు
ఎడే వాడేడే నీ తిమ్మిరొంచె ఘనుడు (2)

సెంద్రుడున్న ఎన్నెలింట ఇంద్రుడొచ్చి బంతులెస్తే
లాగి బంతి మళ్ళి తన్నే మరుడేనా అవునా
చందనాల బొట్టందాలు సరదా సరదా నడకందాలు
పట్టు పంచ కట్టె వరుడేనా అవునా

ఏడే ఏడేడే

తళుకు తార వెన్నెల పాలేనోయ్ పారంగా
సంజె కన్ను మైకాలేలంట
ముద్దు గుమ్మ ఇక్కడ లేదండోయ్
చూడండోయ్ ముద్దు పొడుపు ఎట్టా చెప్పండోయ్
ముస్సలోళ్ళే చెప్పి వెళ్ళండోయ్

పడకటింట పాటలేలమ్మ

ఏడే ఏడే ....

మల్లు పంచె కట్టుకొచ్చి జాతి గిత్త కొమ్ము పట్టి
మళ్ళీ రమ్మన్నా నీ మొగుడతడే అవునా

కన్నా చిరకాలం వర్ధిల్లు ...
కళ్యాణం కళ్యాణం పూతీగక్క కళ్యాణం
కళ్యాణం కళ్యాణం పున్నాగక్క కళ్యాణం
కళ్యాణం కళ్యాణం పులకింతక్క కళ్యాణం
కళ్యాణం కళ్యాణం పూల తీగ కళ్యాణం
పూల తీగ కళ్యాణం

పసిడి తాళి భామకెందుకు ఎందుకు
మూడు ముళ్ళ ముచ్చట్లెందుకు

తొలిమాటేసే హక్కు ముడికి తొలిమాటేసే హక్కు ముడికి
అరెరె అనుబంధాలే రెండో ముడికి
ఊరోళ్ళడిగే మూడో ముడికి

మురిసే మనసే మెరిసే ముడులే

పసిడి తాళి భామకెందుకు ఎందుకు
మూడు ముళ్ళ ముచ్చట్లెందుకు