కు కు కుక్కుకు కుక్కు
ప్రియా... ప్రియతమా (2009)
టిప్పు
విద్యాసాగర్
కు కు కుక్కుకు కుక్కు కుక్కుకు
ఎద నింగీ... మేఘమే తాను
స్వరగంగ రాగమే తాను...
పగలొచ్చే తారకే తానూ...
తానేలే నా చెలియా...
హరివిల్లు చిన్నెలే తాను...
విరిజల్లు చినుకులే తానూ...
వెదజల్లే వెన్నెలే తాను...
తానేలే నా చెలియా...
చూసేటీ కన్నులున్నవీ....
కన్నులకు మాటరాదులే...
మాటాడే పెదవులున్నవీ...
పెదవులకు కళ్ళు లేవులే...
తనునేనే తనునేనే ప్రేమించా ప్రేమించా...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...
ఎద నింగీ... మేఘమే తాను
స్వరగంగ రాగమే తాను...
పగలొచ్చే తారకే తానూ...
తానేలే నా చెలియా...
కన్నులు రెండూ కలగనువేళా లేలెమ్మనే....
లేచేసరికే దూరం జరిగీ పోపొమ్మనే...
దూరంగున్నా విరహంలోనా రారమ్మనే....
తానే దోచీ మళ్ళీ నన్నూ మనసిమ్మనే....
తను చెంతకు చేరగనే ...నా నీడే రెండాయె...
తన పేరే వినగానే.... గిలిగింతే నిండాయె....
పెదవులు సుధలే కురిసినవీ
పులకింతల్లో మురిసినవీ....
నను చంపేసిందీ చూపుతో...
నను బతికించిందీ నవ్వుతో ...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...
కు కు కుక్కుకు కుక్కు కుక్కుకు
గిల్లి గిల్లి ముల్లులాంటి చూపేసిందీ...
అల్లిబిల్లి అల్లరితోటీ ఊపేసిందీ...
వెల్లువంటీ ఆశలు నాలో రేపేసిందీ...
అల్లుకుపోగా ఆగాలంటూ ఆపేసిందీ....
తానుంటే వేసవులే..వెన్నెలలై విచ్చునులే...
తనులేకా వెన్నెలెలే వేసవులై గుచ్చునులే....
లోకంలోనా తానే ఒక అద్భుతము...
హాయ్ తనకే జీవితం అంకితమూ....
తన కాలికి మువ్వై మోగనా
తన పెదవుల నవ్వై సాగనా...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...
తానే తానే నా చెలీ...