December 30, 2019

ఓ.. సుకుమారా..

ఓ.. సుకుమారా..
చిత్రం :  భార్యాభర్తలు (1961)
సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ.. సుకుమారా.. నను చేరా.. రావోయి.. ఇటు రావోయి..
నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే
నిలువగ లేని.. వలపులరాణి.. నీ కొరకే.. తపించునులే

ఓ.. జవరాలా.. ప్రియురాలా.. ఈనాడే.. మనదే హాయి
తనువుగ నేడు.. ఈ చెలికాడు.. నీ దరినే.. సుఖించునులే
చరణం 1:

కోటి కిరణముల కోరిన గాని.. భానుని చూడదు కలువ చెలి
కోటి కిరణముల కోరిన గాని.. భానుని చూడదు కలువ చెలి
వెన్నెల కాంతి.. వెలిగిన వేళా
వెన్నెల కాంతి.. వెలిగిన వేళా
విరుయునుగా విలాసముగా..

నిలువగ లేని.. వలపుల రాణి.. నీ కొరకే.. తపించునులే..

చరణం 2:

వేయి కనులతో వెదికిన గాని.. తారకు జాబిలి దూరమేగా
వేయి కనులతో వెదికిన గాని.. తారకు జాబిలి దూరమేగా
కలువల రాణీ.. వలపులలోనే
కలువల రాణీ.. వలపులలోనే
కళకళలాడి చేరునుగా..

తనువుగ నేడు.. ఈ చెలికాడు.. నీ దరినే.. సుఖించునులే..