చలికాలమింకా ఎన్నాళ్ళో
చిత్రం : రాగలీల (1987)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
పల్లవి:
చలికాలమింకా ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఇంకా ఈ దూరం
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఈ మాఘమాసం
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
చలికాలమింక ఎన్నాళ్ళో
తొలిప్రేమ రాగాలెన్నాళ్ళో...
చరణం 1:
ఈడు కన్నుగీటేనమ్మా
నీడ ముద్దులాడేనమ్మా
రేయి తెల్లవారేదాకా
జోల పాడుకోలేనమ్మా
ఏమి ఎద చాటోనమ్మా
ఎంత ఎడబాటోనమ్మా
మాట పొరపాటైపోతే
మానమే పోతుందమ్మా
వలపే వలలా చుట్టేసే
కలలే కనులు కట్టేసే
చరణం 2:
సొంత తోడు లేనేలేక
సొమ్మసిల్లి పోయేనమ్మా
సన్నజాజి పూతీగల్లే
సన్నగిల్లి పోయేనమ్మా
కౌగిలింత దాహాలన్నీ
గాలి కార బోసేనమ్మ
పట్టలేని మోహాలెన్నో
పాటలల్లు కున్నానమ్మా
కలదో లేదో ఆ భాగ్యం
కలయో నిజమో సౌభాగ్యం
చలికాలమింకా ఎన్నాళ్ళో
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఇంకా ఈ దూరం
మలిసందె గీతాలెన్నాళ్ళో
ఎన్నాళ్ళు ఇంకా ఈ దూరం
ఉన్నమాట చెప్పలేను
చెప్పకుండ ఆగలేను
చెప్పబోతే మాటేరాదు
చెప్పకుంటే పొద్దేపోదూ