December 30, 2019

ఆ కృష్ణుడు ఏలిన ద్వారక...


ఆ కృష్ణుడు ఏలిన ద్వారక...
దేవిపుత్రుడు (2001)
సంగీతం::మణిశర్మ

పల్లవి::

కెరటాల అడుగున కనుచూపు మరుగున
నిదురపోతున్నాది ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
చరణం::1

బాలకృష్ణుని బంగారు మొలతాడు
చిన్నికృష్ణుని సరిమువ్వ గజ్జెలు
సత్యాభామాదేవి అలకపానుపు
రుక్మిణిదేవి తులసీవనము
తీయని పాటల మురళి
తీరైన నెమలిపింఛం
కృష్ణుడు ఊదిన శంఖం
శిశుపాలుని చంపిన చక్రం
కనులు తెరువకుండా కథలు కథలుగా ఉన్నవి ఈనాటికి

కెరటాల అడుగున కనుచూపు మరుగున
నిదురపోతున్నాది ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక
ఆ కృష్ణుడు ఏలిన ద్వారక
శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక