వాన కన్యకా ....
మూడుముక్కలాట (2000)
కీరవాణి
బాలు, చిత్ర
ఆ అ ఆ అ ఆ.......
వానకన్యకా
ఆ అ ఆ అ ఆ........
వానకన్యకా
......
వాన కన్యకా ....
వలపు కానుకా....
నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబు రాయగా
మేఘమాలికా
మెరుపు చాలికా
ఈ చిటపట చినుకుల దరువులు నాకే కన్ను గీటగా
చలి చలి ఉడుకుల గమకంలో
తొలి ఒడిదుడుకుల గమకంలో
తెగించి హద్దులు
ముగించి ముద్దులు
బిగించె బంధాలే....
పాడనా సౌందర్య లహరీ
మేఘమాలికా మెరుపు చాలికా
ఈ చిటపట చినుకుల దరువులు నాకే కన్ను గీటగా
వాన వాన వాన వాన వాన వాన వాన వాన
వాన వాన
వాన వాన వాన వాన వాన వాన వాన జడి వాన వాన
అమ్మమ్మా వానమ్మమ్మా హాయమ్మమ్మా హాయ్
అమ్మ బాబోయ్ పరువాన ఈ తడి తడి అలజడి వాన
వద్దు వద్దోయమ్మా
పొద్దోయమ్మా యమయమ సమయానా..
అయ్యబాబోయ్ కురిసేనా ఈ తొలకరి
చినుకుల సీమ ఇద్దు ఇద్దోయమ్మా
మనసిద్దోయమ్మ తహతహ తరుణాన
వానమ్మ వడగళ్ళొ జాణమ్మ చెడుగుళ్ళొ
నాజూకు నలుగుళ్ళొ అందాల అలుగుళ్ళొ
అబ్బబ్బబ్బబ్బ వరించి ప్రేయసి
పురించి హాయిని హరించువేళల్లో..
రాయనా శృంగార లహరీ
మేఘమాలికా.. మెరుపు చా..లికా
వాన కన్యకా వలపు కా...నుకా..
..........
హా...హ హా.....హ హ హ హ హా....
హా..హా హహా హహా హహ హ..హా......
...........
ఎందుకబ్బ చెలువాన ఈ మగసిరి
సెగసిరి వాన చాలు చాలోయబ్బా
...ఎట్టాగబ్బా వలపుల వడదెబ్బ
ఏమిటబ్బ చెలి వాన ఈ సిరి సిరి సొగసరి వాన
వాలు వాలోయబ్బా వానోయబ్బా వయసుల ముసురబ్బా
తడిమేటి తాపాలు ఉడమేటి ప్రాయాలు
తడిచీర తాళాలు
నడుమింటి నాట్యాలు
అబ్బబ్బబ్బబ్బ జవాబు దొరకని
సవాల వలపే సివాలుపుట్టిస్తే...
చేరనా నీప్రేమ నగరీ
వానకన్యకా వలపు కానుకా
నీ తళతళ మెరుపుల విరుపులు నాకే జాబురాయగా
చలిచలి ఉడుకుల చమకంలొ
తొలిఒడిదుడుకుల గమకంలొ
తెగించి హద్దులు
ముగించి ముద్దులు బిగించె బంధాలే....
పాడనా సౌందర్య లహరీ..