December 30, 2019

నవ్వాలమ్మ నవ్వాలి


నవ్వాలమ్మ నవ్వాలి
యమజాతకుడు(1999)
వందేమాతరం శ్రీనివాస్
సుద్దాల అశోక్ తేజ
కె.జె.ఏసుదాస్

నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి
నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి

మేనమామ నవ్వోలె
మళ్లీమళ్లీ నవ్వాలి
నూరేళ్ళు నువ్వు నవ్వంగ
దేవుళ్ళు చల్లగ చూడంగ
నూరేళ్ళు నువ్వు నవ్వంగ
దేవుళ్ళు చల్లగ చూడంగ
నా తోడ పుట్టిన మీ అమ్మా
యాడున్నా కడుపు నిండఁగా

నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి

మేనమామ నవ్వోలె
మళ్లీమళ్లీ నవ్వాలి

చరణం 1 :

అన్నెం పున్నెం తెలియని
ఆడబిడ్డవు నువ్వమ్మా
పాడులోకం చూడమ్మా
పొడుచుకొని తింటుందమ్మా

పులుల మధ్యన లేడి కూనవు
ముళ్లకంపలో మల్లెతీగవు...

అయినా ఎదిరించి గెలవాలమ్మా
పొడిచే పొద్దోలే ఎదగాలమ్మా...

నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి

మేనమామ నవ్వోలె
మళ్లీమళ్లీ నవ్వాలి

చరణం 2:

కన్నతల్లి కన్నతండ్రి
నమ్ముకున్న మేనమామ
అందరు బిడ్డకు దూరమై
విధిచేతిలో బలియై పోతే

ఇంతచక్కని బంగారుతల్లి
కంటనీరు పెట్టి కలతచెందితే

ఏ తల్లి నిన్ను ముద్దాడుతుంది
ఏ పంచ నీకు నీడనిస్తుంది

నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి

మేనమామ నవ్వోలె
మళ్లీమళ్లీ నవ్వాలి

చరణం 3:

సప్పుడు రాని గంటలు
గుండెల్లో అంటించె నిప్పులు
అంతుచిక్కని దారిలో
వెళ్ళాలి అవతలి గట్టుకు

కలుగుతున్నది ఆశ ఉండిపోవాలని
తరుముతున్నది గడువు వెళ్లిపోవాలని

ఈ జన్మకు నన్ను మన్నించవమ్మా
నీ బిడ్డనై పుడితే అంతే చాలమ్మా

నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి

నవ్వాలమ్మా నవ్వాలి
పువ్వులోలె నవ్వాలి

మేనమామ నవ్వోలె
మళ్లీమళ్లీ నవ్వాలి

నూరేళ్ళు నువ్వు నవ్వంగ
దేవుళ్ళు చల్లగ చూడంగ

నా తోడ పుట్టిన మీ అమ్మా
యాడున్నా కడుపు నిండఁగా