నేలమ్మా నింగమ్మా
ఆడదే ఆధారం (1987)
సిరివెన్నెల
శంకర్-గణేష్
బాలు
పల్లవి:
నేలమ్మా నింగమ్మా
నీరమ్మా నిప్పమ్మా
గాలమ్మా కనరమ్మా సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం…
గాలమ్మా కనరమ్మా సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం…
అవని అందమూ
కుదురు లేనిది
ఏడాదికొక్కటే
ఏడాదికొక్కటే
వసంతమున్నది
ఋతువు మారినా
ఋతువు మారినా
చెదిరిపోనిది
అమ్మాయి మేనిలో
అమ్మాయి మేనిలో
అందాల పెన్నిధి
తుళ్ళకే అలా
తుళ్ళకే అలా
గంగవెల్లువా
సొగసు పొంగులో...ఈమె సాటివా
వయ్యారి వంపులు
సొగసు పొంగులో...ఈమె సాటివా
వయ్యారి వంపులు
నీ ఒంటికున్నవా
||నేలమ్మా||
.
చరణం 2:
కలికి కళ్ళలో
||నేలమ్మా||
.
చరణం 2:
కలికి కళ్ళలో
కలల మెరుపుతో
నువు తెల్లబోదువే
నువు తెల్లబోదువే
నీలాలగగనమా
చిలక సొంపులో
చిలక సొంపులో
అంత మైకమా
చిరుగాలి నువ్వలా
చిరుగాలి నువ్వలా
స్తంభించిపోకుమా
చెలియ తనువులో
చెలియ తనువులో
వేడి తాకితే
చలికి వణకవా
చలికి వణకవా
సూర్యబింబమా
ఆ మంచు మంటతో
ఆ మంచు మంటతో
జాబిలిగ మారవా
||నేలమ్మా||
||నేలమ్మా||