మాయమై పోతున్నడమ్మా, మనిషన్న వాడు
Dr... అందెశ్రీ
ఎఱ్ఱసముద్రం (2008)
వందేమాతరం శ్రీనివాస్
మాయమైపోతున్నడమ్మా, మనిషన్నవాడు
మచ్చుకైన లేడు చూడు, మానవత్వం వున్న వాడు
నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు (2)
యాడ ఉన్నడోకాని కంటికి కనరాడు..
మాయమైపోతున్నడమ్మా...
పగరిసగా .. పగరిసగా
నిలువెత్తు స్వార్ధము నీడలగోస్తుంటే,
చెడిపోక ఏమైతడమ్మా, చెడిపోక ఏమైతడమ్మా
ఆత్మీయ బంధాల ప్రేమసంబంధాల...
దిగ జారుతున్నదోయమ్మ, దిగ జారుతున్నదోయమ్మ,
అవినీతి పెను ఆశ అంధకారంలోన (2)
చిక్కిపోయి రోజు శిదిలమౌతున్నాడు...
మాయమై పోతున్నడమ్మా... (2)
ఇనుప రెక్కల డేగ విసిరినా పంజాకు,
కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నారు (2)
ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు,
అస్తిపంజరం అయ్యి అగుపించనున్నడు (2)
కదిలే విశ్వము తన కనుసన్నలో నడుమ (2)
కనుబోమ్మలేగరేసి కాలగమనము లోన...
మాయమై పోతున్నడమ్మా...
దాస సగగ మగస...
కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి,
పంది నందిని జుస్తేపడి మొక్కుతుంటాడు (2)
చీమలకు చక్కర పాములకు పాలోసి
జీవకారుణ్యమే జీవితం అంటాడు (2)
తోడ పుట్టిన వాళ్ళ ఊరవతలకి నెట్టి (2)
కులమంటూ ఇలా మీద కలహాల గిరి గీసి...
మాయమై పోతున్నడమ్మా...
ఇరువైదు పైసలగారోత్తులు కాల్చి,
అరవైదు కోట్ల వరములడుగుతాడు
దైవాల పేరుతో చoదాలకై గండ భక్తి
ముసుగు తొడిగి భలే పోజు పెడతాడు
ముక్తి పేరా నరుడు రక్తిలో రాజి
రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు...
మాయమై పోతున్నడమ్మా...
అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి,
చుట్టూ తిరుగుతున్నదమ్మ (2)
రూపాయి కొరకు ఏ పాపానికైతేమి
ఒడిగట్టే నదిగొ చూడమ్మా
కోటి విద్యలు కుటి కోసమన్నది పోయి (2)
కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగి..
మాయమై పోతున్నడమ్మా, మనిషన్న వాడు
మచ్చుకైన లేడు చూడు, మానవత్వం వున్న వాడు...