December 30, 2019

నీ లేత గులాబీ పెదవులతో


నీ లేత గులాబీ పెదవులతో
చిత్రం: మా ఇంటి దేవత (1980)
సంగీతం : మాస్టర్ వేణు 
గానం: ఘంటసాల 

నీ లేత గులాబీ పెదవులతో
కమ్మని మధువును తాకాలి
లేత గులాబీ పెదవులతో
కమ్మని మధువును తాకాలి
విందులు చేసే నీ అందాలూ
నా మదిలోనే చిందాలీ
లేత గులాబీ పెదవులతో
కమ్మని మధువును తాకాలి
మధురమైన ఈ మంచి రేయిని
వృధా చేయకే సిగ్గులతో
మధురమైన ఈ మంచి రేయిని
వృధా చేయకే సిగ్గులతో
చంద్రుని ముందర తారవలే
చంద్రుని ముందర తారవలే
నా సందిట నీవే ఉండాలీ
ఈ మధువంతా నీ కోసం
పెదవుల మధువే నాకోసం

మధువు పుట్టింది నాకోసం
నేను పుట్టింది నీకోసం
ఊ.... హుహు హుహు
మధువు పుట్టింది నాకోసం
నేను పుట్టింది నీకోసం
కన్నుల కాటుక కరగక ముందే
కన్నుల కాటుక కరగక ముందే
సిగలో పూవులు వాడక ముందే
సిగలో పూవులు వాడక ముందే
పానీయముతో పరవశమై
పానీయముతో పరవశమై
నీ కౌగిట నన్నే బంధించుకో
లేత గులాబీ పెదవులతో
కమ్మని మధువును తాకాలి