తూ లేజా సరోజా
ఆగడు (2014)
భాస్కరభట్ల
రాహుల్ నంబియార్
థమన్
హల్లో హల్లో నీ ఊహల్లో ఎగరేస్తున్నావే
నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే
గుళ్లో గంటై నా గుండెల్లో మోగేస్తున్నావే
బళ్లో చదివిన పాఠాలన్నీ మరిపిస్తున్నావే
పండగల్లె మార్చుకుంట నువ్వు నేను కలుసుకున్న తేదీ
ఉన్న ఒక్క జిందగీకి ఇంతకన్న పెద్ద పండగేదీ
తూ ఆజా సరోజా తూ లేజా సరోజా
తూ ఆజా సరోజా తూ లేజా సరోజా
హల్లో హల్లో నీ ఊహల్లో ఎగరేస్తున్నావే
నెల్లో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే
కనురెప్పల దుప్పటిలో నిన్ను వెచ్చగా దాచుకుంట
ముద్దుగా చూసుకుంట ఒకటీ రెండు మూడు పూటలా
నాపెదవుల అంచుల్లో నిన్ను మాటలా మార్చుకుంట
నవ్వులా పెంచుకుంట పాడూకుంట కొత్త పాటలా
మసాకల్లీ మైకంలోనా మైదీవానా మనసాగనంట్టున్నాదె
ఎంత ఆపినా రెండూ మూడూ చాలవంట నాలుగేళ్లు కావాలి కళ్లూ
ఎంత అందమైన పిల్ల సొంతమైతె ఆగదె దిల్లూ
తూ ఆజా సరోజా...
నీ అడుగుల సడివింటె ఎంత మొద్దు నిద్దరైనగాని
నీళ్లు కొట్టి లేపినట్టు ఒక్కసారి తేలిపోతదే
నువ్వు ఎదురుగ వస్తుంటే ఆ నింగిలోని చందమామ
దారి తప్పి నేలమీద కొచ్చినంత వింత గున్నదే
ఐస్కాంతమేదో నీలో దాగున్నదే అదోరకం అలజడిలోకి
లాగుతున్నదే కల్లనుంచి గుండెలోకి బంధిపోటు దొంగలాగ
దూకీ కొళ్లగొట్టి పారిపోకె ముక్కు పిండి తీర్చుకోన బాకీ
తూ ఆజా సరోజా తూ లేజా సరోజా
తూ ఆజా సరోజా తూ లేజా సరోజా