December 31, 2019

సూరీడె సూరీడె సూపుల్లొ


సూరీడె సూరీడె సూపుల్లొ
బృందావనం (2010)
థమన్
అనంత్ శ్రీరామ్
శంకర్ మహదేవన్, శ్రేయా గోషాల్

సిగురాకు సన్నగ ఊగిందె సినదాని సెంగుని ఊపిందె
సిలకో ఓ సిలకా...సిలకో

మల్లి కోమంటి కొండ మల్లి గుండెల్లొ గొండు మల్లి చామంతి జాజి మల్లి
సోకుల్లో సూది మల్లి నాజూకు నాగ మల్లి సందెల్లొ సుక్క మల్లి
కవ్వించె కన్నె మల్లి ఎనెల్లో ఎర్ర మల్లి అందాల బొండు మల్లి
అందాల బొండు మల్లి అందాల బొండు మల్లీ
సూరీడె సూరీడె సూపుల్లొ సూరీడె మాపల్లెలోనె సేరాడే
ఎర్రాని సూరీడె కుర్రాని సూరీడె ఎదలోన సీకటి ఏరాడే
ఇన్నాళ్ళు లేదె ఈ నేల నేడె ఆకాశం అవుతున్నదె
ఈ నింగిలోనె ఆ మాయగాడె వెలుగేదొ నింపాడె

ఎయ్ రాజ ఈ రోజు మనదేర ఇరగెయ్ రాజ ఈ సోటు మనదేర
ఎయ్ రాజ ఈ ఆట మనదేర సితకెయ్ రాజా
ఎయ్ రాజ ఈ దుమ్ము రేగేల ఇరగెయ్ రాజ నీ దిమ్మ తిరిగేల
ఎయ్ రాజ బ కుమ్ముకోవాల సితకెయ్ రాజా

మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లి అందాల బొండు మల్లీ

ఈ గాలికి లాలన తెలుసులే నీ శ్వాసె కలిసాకె లాలించె గుణమొచ్చింది
ఈ పువ్వుకు నవ్వులు తెలుసులే నీ ఊసె విన్నాకె నవ్వుల్లొ మునకేసింది
అమ్మొ అమ్మమ్మొ అమ్మాయికేమయిందె మాటల్లో మంత్రాలె కలిపేసి కవ్విస్తుందె
నీ వెంటె ఉందంటె రాయైన మాటాడుద్దె నేనేం చేసేది నువ్వే చెప్పమ్మ

ఎయ్ రాజ ఆ నింగి ఒంగేల ఇరగెయ్ రాజ ఈ సందె చిందేల
ఎయ్ రాజ ఈ రంగు పొంగేల సితకెయ్ రాజా

సూరీడె సూరీడె ఎర్రని సూరీడె మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లెల్లోనె సేరాడె

ఆ చూపులు సందడి చేసెనే నీ మాటె విన్నాకె ఆనందం తుల్లిందంట
ఆ అడుగులు అల్లరి చేసెనే నీ పాటె సయ్యాటై ఉత్సాహం పొంగిందంట
అంతా నా వల్లె అంటుంటె ఎట్టాగమ్మ మీరంత కలిసొచ్చి ఈ వింతె చేసారమ్మ
మంత్రాలె నువ్వేసి మేమేదొ చేసామంటె వేగేదెట్టాగ నువ్వె చెప్పమ్మ

ఎయ్ రాజ ఈ ఊరు కదిలేల ఇరగెయ్ రాజ లోకాన్ని కుదిపేల
ఎయ్ రాజ ఆ కళ్ళు చదిరేల సితకెయ్ రాజా

సూరీడె సూరీడె ఓ ఎర్రాని సూరీడె ఓ మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లె మా పల్లెల్లోనె సేరాడె

వరి సేను రెప్పలు వార్సిందె సిరి గువ్వ గూటికి సేరిందె
సిలకో ఓ సిలకా...సిలకో