అంజలీ అంజలీ పుష్పాంజలీ


అంజలీ అంజలీ
డ్యూయెట్ (1994)
వెన్నెలకంటి 
ఏ.ఆర్.రెహమాన్
చిత్ర, బాలు

పల్లవి:

అంజలీ అంజలీ పుష్పాంజలీ
అంజలీ అంజలీ పుష్పాంజలీ

పువ్వంటి పదములకు పుష్పాంజలి
ముద్దైన పెదవులకు మోహాంజలి
కలహంస నడకలకు గీతాంజలి
కనరాని నగవులకు కవితాంజలి

చరణం 1:

నిన్నదాక నువ్వూ నేను ఇరువురం ఎవరనీ...
కమ్మని బంధం ఇలా తెలిపెను ఒకటని
కడలిని పడు వానలా కలిసిన మది ఇదీ
కరిగిన సిరిమోజులా కధ ఇది నా చెలీ

ఎదురుగ తొలిస్వప్నం తొణికినదీ...
ఎదలో మధుకావ్యం పలికినదీ...
అంజలీ అంజలీ వలపుల నా చెలీ...

చరణం 2:

కన్నుల సంకేతమే కలలకు తొలకరి 
వెన్నెల జలపాతమే వలపుకు తదుపరి
గుండెలో సంగీతమే కురిసినదెందుకో
కోయిల పాటే ఇలా పలికిన విందుకో
చెలువుగ ఎద మారే మధువనిగా
అమవస నిశి మారే వెన్నెలగా

అంజలీ అంజలీ ఇది హృదయాంజలీ

నీ ప్రేమలాహిరికి పుష్పాంజలి
నీ గానమాధురికి గీతాంజలి
ఎద దోచు నవ్వులకు నటనాంజలి
కవి అయిన నీ మదికి కవితాంజలి

చరణం 3:

అంజలి నీ చూపులో వెన్నెల వెల్లువే
అంజలి నా ఊపిరై పలికెను పల్లవే
కన్నుల నువు లేనిదే కలలే రావులే
నా మది నువు లేనిదే కవితే లేదులే

తెలిసెను నువ్వే నా మనసువనీ
మోజుకు నెలవైనా వలపువనీ