December 31, 2019

కొంతకాలం కొంతకాలం


కొంతకాలం కొంతకాలం
చంద్రముఖి (2005)
విద్యాసాగర్
వెన్నెలకంటి
సుజాత మోహన్, మధు బాలకృష్ణ

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి..
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి
కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి..
నిన్న కాలం మొన్న కాలం రేపు కూడా రావాలి
ఎంత కాలమెంత కలం హద్దు మీరకుండాలి
అంత కాలం అంత కాలం ఈడు నిద్దరాపాలి
\\కొంత కాలం\\
గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతాకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండాకాలం
మదనుడికి మల్లె కాలం
మదిలోనే నిలుపు ఏళ్ళ కాలం
చెలరేగు వలపు చెలి కాలం
కలనైన తెలుపు కలకాలం
తొలి గిలి కాలం కౌగిలి కాలం
మన కాలం ఇది..ఆ..
\\కొంత కాలం\\

కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాముకాలం
గుచ్చే చూపులకు గిచ్చే కైపులకు వచ్చే ప్రేమ కాలం
తమి తీరకుండు తడి కాలం
క్షణమాగనంది ఒడికాలం
కడిగింది సిగ్గు తొలికాలం
మరిగింది మనసు మలి కాలం
మరి సిరి కాలం మగసిరి కాలం
మన కాలం పద..ఆ..
\\కొంత కాలం\\