December 30, 2019

ఊహలేవో రేగే



ఊహలేవో రేగే
చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, కవితాకృష్ణమూర్తి

పల్లవి:

హే...ఊహలేవో రేగే..
ఊహలేవోరేగే ఊపుతో ననులాగే
వేడిసెగలై సాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా

పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా

ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
చరణం : 1

ఇదివరకెరగని దిగులును దిగనీవా
నిలువున రగిలిన నిగనిగ నీడేగా
మెలికలు తిరిగిన మెరుపై దిగినావా
కుదురుగా నిలవని కులుకుల తూనీగా

ఓ..కోరివస్తా కాదు అనుకోకా...ఆ...
ఊహలేవోరేగే ఊపుతో ననులాగే
హాయి కథ కొనసాగే రేయిపగలు ఇలాగే

చరణం : 2

ఓ...ఎందుకు? ఏమిటి? అడగని గొడవేగా
ఓడేదాకా వదలని ఆటేగా
ఓ..గుసగుసవేడికి గుబులే కరుగునుగా
కుశలములడుగుతూ  చెరిసగమైపోగా
ఒకరికొకరం పంచుకుందాం రా.. ఆ..ఆ..

పూలతీగై ఊగే లేత సైగే లాగే
హాయి కథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశే తీరగా
హే... ఊహలేవో రేగే ఊపుతో ననులాగే
వేడిసెగలైసాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా.. ఆ..

లలలాల.. లాలలాలా.. లలలాలా
లాలలాలలాలా లాలలాలలలాలా