December 31, 2019

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో



కొంటెచూపుతో నీ కొంటెచూపుతో
చిత్రం: అనంతపురం 1980 (2006)
సాహిత్యం: వెన్నెలకంటి రాజేశ్వరప్రసాదు
సంగీతం: జేమ్స్ వసంతన్
నేపథ్యగానం: బెల్లీ రాజ్, దీపా మరియమ్
రాగం: రీతిగౌళ

పల్లవి: 

కొంటెచూపుతో నీ కొంటెచూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్నినవ్వుతో ఒక చిలిపినవ్వుతో
ఏదో మాయజేసి అంతలోనే మౌనమేలనే

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే 
ఈ వేళ
కళ్లు రాసే నీ కళ్లు రాసే
ఒక చిన్ని కవితా ప్రేమేనేమో అది
చదివినప్పుడు నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినదిచరణం 1:

పగలే రేయైన యుగమే క్షణమైన 
కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈవేళ 

ఇరువురి దూరాలు తరగనీ
ఒడిలో వాలాలనున్నది
వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటం ఇది

చరణం 2:

కళ్లలో నిద్రించి కలలే ముద్రించి 
మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి 
నీవే నేనంటు తెలుపగా

చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత