మౌనమే..ప్రియా ధ్యానమై


మౌనమే ప్రియా... ధ్యానమై
చిత్రం: చిన్ని కృష్ణుడు (1986)
సంగీతం: ఆర్.డి. బర్మన్
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: జానకి

పల్లవి:

మౌనమే ప్రియా... ధ్యానమై..
మౌనమే ప్రియా... ధ్యానమై..
నీలికన్నులా.. నిలిచీ 
పిలిచే నా ప్రేమా..

మౌనమే ప్రియా... ధ్యానమై..
నీలికన్నులా.. నిలిచీ 
పిలిచే నా ప్రేమా..
మౌనమే ప్రియా... ధ్యానమై..
మౌనమే ప్రియా... ధ్యానమై..

చరణం 1:

చెప్పాలంటే నాలో..
సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే 
తారామందారాలు..

చెప్పాలంటే నాలో..
సిగ్గే శ్రీకారాలు
వెన్నెలలో కాగే 
తారామందారాలు..

పొద్దే తాంబూలాలై..
ఎర్రనాయే సంజెలన్ని..
పల్లవించే ఊహలన్ని
నా ప్రేమ పాటలాయే..

ఈ దూరం..దూరతీరం 
ముద్దులాడే దెన్నడో..

మౌనమే ప్రియా... ధ్యానమై..

చరణం 2:

కన్నె చెక్కిళ్ళలో..
కందే గోరింటాకు
కన్నులతో రాసే..
ప్రేమేలేఖ నీకూ..

కన్నె చెక్కిళ్ళలో..
కందే గోరింటాకు
కన్నులతో రాసే..
ప్రేమేలేఖ నీకూ..

వచ్చే మాఘమాసం..
పందిరేసే..ముందుగానే..
మీరు నేను పల్లకీలో..
ఊరేగే శుభవేళ

నీ చిత్తం నా భాగ్యం..
మనువాడే దెన్నడో..