లే ఛలో
బ్రూస్ లీ (2015)
థమన్
రామజోగయ్య శాస్త్రి
థమన్, మేఘ
లే చలో లే చలో లే చలో లే చలో లే చలో
లే చలో లే చలో లే చలో లే చలో లే చలో
నువ్వంటే నేనురా నీవెంటే నేనురా
నేనంటూ లేనురా రా రా రా
నీతోనే నేనులే నీలోనే నేనులే
నాలోనే లేనులే ఓహ్ హో హో
లే చలో ఎక్కడికో నను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏలోకం లోకో లే చలో
వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే
నను లే చలో చలో
నువ్వు నడిచే నేలపైన నేను నడిచా నీడగా
నిన్ను తాకి వీచుగాలె నిలుచుకున్నా శ్వాసగా
నిన్ను నన్ను జంట కలిపి మనం లాగా మారగా
మనం అన్న మాటే ఎందుకు ఉన్నదొక్కరైతే
దూరం ఎక్కడుంది మనసులో మనసు కలిసిపోతే
అంతగా నే సొంతమై ఏనాటికి నేనుంటా నంటే
లే చలో ఎక్కడికో నన్ను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏలోకం లోకో లే చలో
వేరెవ్వరు కనిపించని ఆ చోటుకె నను లే చలో
కొంత కాలం ముందు వరకు నాకు నేను తెలుసులే
ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే
ఎందుకంటె ఎప్పుడైనా కంటి నిండా నీ కలే
పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్నా..
చూపు తిప్పనన్న ఎవరెలా తట్టి లేపుతున్నా
నేనని ఉన్నానని గుర్తుండదే ఎపుడేం చేస్తున్నా
లే చలో ఎక్కడికో నన్ను లే చలో
లే చలో నీతో వస్తా లే చలో
లే చలో ఏలోకం లోకో లే చలో
వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే
నన్ను లే చలో చలో